సినిమా రంగం అంటేనే హిట్ లేదా ప్లాప్ అనేలా ఉంటాయి. ఒకసారి సినిమా హిట్ అయిందంటే చాలు ఆ సినిమాలో ఏవేం పనులు అయితే కలిసి వచ్చాయో వాటిని బాగా రిపీట్ చేస్తుంటారు హీరోలు

ఈ విషయంలో స్టార్ డైరెక్టర్లు కూడా అస్సలు వెనకడుగు వేయరు. తమ సినిమాల్లో కొందరు యాక్టర్ల విషయంలో అలాగే కేటగిరీల విషయంలో అలాంటివే తరచూ ఫాలో అవుతుంటారట మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా కొందరు యాక్టర్ల విషయంలో చాలా సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు..


ముఖ్యంగా దర్శక ధీరుడు అయిన జక్కన్న తన ప్రతి సినిమాలో కూడా చంద్రశేఖర్ అనే యాక్టర్‌కు అవకాశం ఇస్తూ వస్తున్నారు. జక్కన్న సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలు పోషిస్తుంటారు. ఒక్క యమదొంగ మరియు బాహుబలిలో మాత్రమే ఆయన కనిపించలేదు. మిగతా అన్ని సినిమాల్లో మాత్రం ఆయనకు మంచి అవకాశాలు ఇచ్చారు. ఇక జక్కన్న దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక డ్యాషింగ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ కూడా యాక్టర్ సుబ్బరాజును తరచూ కూడా రిపీట్ చేస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన 8 సినిమాల్లో సుబ్బరాజుకు అవకాశం ఇచ్చారట పూరి జగన్నాథ్‌. అమ్మా నాన్న తమిల అమ్మాయి సినిమా నుంచి సుబ్బరాజును రిపీట్ చేస్తున్నారట పూరీ జగన్నాథ్‌. ఇక డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా మిరపకాయ్ సినిమా నుంచి మొదలుకుని ప్రతి సినిమాలో కూడా రావు రమేశ్‌కు ఏదో ఒక పాత్ర ఇస్తున్నారని తెలుస్తుంది.


ఇక క్లాస్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ కూడా తన సినిమాల్లో అమిత్ అంకిత్‌కు ఛాన్సలు ఇస్తున్నారు. ఏదో ఒక చిన్న పాత్రలో అయినా ఆయన్ను చూపిస్తారట త్రివిక్రమ్‌. ఇక కృష్ణ వంశీ బ్రహ్మాజీని మరియు ఆర్జీవీ తనికెళ్ల భరణిని అలాగే శ్రీకాంత్ అడ్డాల రావు రమేశ్‌ను తమకు కలిసి వచ్చే యాక్టర్లుగా భావిస్తున్నారు.. వారు తెరకెక్కించే సినిమాల్లో వారికి మాత్రం ఒక ఛాన్సు కచ్చితంగా అయితే ఇస్తుంటారు. అయితే ఈ సెంటిమెంట్ కూడా వారికి మాత్రం బాగానే పనిచేస్తుందండోయ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: