మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు,  క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రవితేజ వరుసపెట్టి సినిమాలలో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాలు నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది, అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల అవుతుందా అని అనుమానాలు ప్రేక్షకుల వచ్చే లోపే మరొకసారి ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు  చిత్ర బృందం కన్ఫామ్ చేసింది.

ఇలా రవితేజ కరోనా ప్రభావాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన సినిమాను థియేటర్ లలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'  సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు, ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాతో పాటు రవితేజ, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు,  వీటితో పాటు సుదీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'రావణాసుర' అనే సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు, ఇలా రవితేజ కారోనా ను ఏమాత్రం పట్టించుకోకుండా తన సినిమా విడుదల తేదీలను ప్రకటించడం మాత్రమే కాకుండా సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: