అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ కు కెరియర్ ప్రారంభంలో అనేక అపజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పలకరించాయి, కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఆ అపజయాలను చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ వెళ్ళింది.  అలాంటి సమయంలోనే శృతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది, ఇలా గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శృతి హాసన్ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. శృతి హాసన్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది, ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా శృతి హాసన్ వయసు పెరుగుతున్న క్రమంలో కొందరు హీరోయిన్ లు తమ అందం గురించి ఆందోళన చెందుతూ మరింతగా అందం కాపాడుకునేందుకు ఖర్చు చేస్తూ ఉంటారు, కానీ శృతి హాసన్ అలా కాదు అని అంటుంది. వయసు పెరుగుతున్నడం చాలా సహజమైన విషయం, దానిని ఎవరూ కూడా దాచలేరు. వయస్సుకు తగ్గట్టు మనుషులు కూడా మారుతూ ఉండాలి, శారీరకంగా నాలో చాలా వరకు మార్పులు వచ్చాయి. ఇంకా ముందు ముందు వయసు పెరుగుతున్నా కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది, అయినా నేను ఏమాత్రం ఫీల్ అవ్వను. వయసు లో ఉండే రహస్యం అదే.. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. వయసు పెరుగుతోంది.. అందం తగ్గుతోంది అనే ఆందోళన నాకు అస్సలు లేదు అని శృతి హాసన్ తెలియజేసింది. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ సినిమా కెరియర్ విషయానికి వస్తే... ప్రస్తుతం శృతి హాసన్, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా తో పాటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: