రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లి సందడి సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. సినిమా హిట్ కాకపోయినా కూడా ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్ లకు అలాగే ఇతర నటీనటులకు మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వీరికి బాగా కలిసి వచ్చిందని కూడా చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ ఇద్దరు హీరో హీరోయిన్ లకు కూడా మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది.

పెళ్లి సందడి సినిమా కు ముందు రోషన్ నిర్మల కాన్వెంట్ అనే సినిమా చేసినా కూడా ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది. ఆ సినిమా మా తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కూడా హీరో గా ఏమాత్రం పేరు రాలేదు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్రరావు తో కలిసి చేసిన పెళ్లి సందడి సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురాగా ఈ సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆయనకు అవకాశాలు రావడం విశేషం. రెండు పెద్ద సంస్థలతో ఆయన సినిమాలు చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు హీరోయిన్ శ్రీలీల కూడా మంచి అవకాశాలను అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రవితేజ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అంతే కాదు మరి కొంత మంది యంగ్ హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేతినిండా ప్రాజెక్టులతో ఈ ఇద్దరు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. మరి వీరు తమ తదుపరి సినిమాలతో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటారో అనేది చూడాలి. కొత్త హీరోలు కొత్త హీరోయిన్ లు రావడం కూడా ఎక్కువైనా నేపథ్యంలో వీరు తమ సినిమాలతో ఏవిధంగా ఆకట్టుకుంటారు ఎ స్థాయి లో ఎదుగుతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: