పుష్ప సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన పుష్ప సినిమా రెండవ భాగం ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉండగా ఇప్పుడు ఈ రెండవ భాగం సినిమా పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఎవరితో చేయాలన్న తర్జనభర్జనలు పడుతున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన తన తదుపరి సినిమా చేస్తున్నాడనే వార్తలు ఇప్పుడు వచ్చే వార్తలు బయటకు వస్తుంది.

తమిళ సినిమా పరిశ్రమతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు మురుగదాస్ మహేష్ బాబుతో స్పైడర్ సినిమా చేసిన తర్వాత మరే తెలుగు సినిమా కూడా చేయలేదు. అలాంటి మురగదాస్ తో ఇప్పుడు సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఎదురుచూస్తున్నాడని వార్తలు మెగా కాంపౌండ్ నుంచి వినబడుతున్నాయి. అంతేకాదు అట్లీ దర్శకత్వంలో కూడా అల్లుఅర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి.

దీంతో బోయపాటి శ్రీను తో ఆయన సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. వెరైటీ సినిమాలు చేయడానికి ఇష్టపడే అల్లు అర్జున్ కొత్త కాంబినేషన్ లో చేస్తాడు కానీ ఒకసారి సినిమా చేసిన బోయపాటి శ్రీనుతో సినిమా ఎలా చేస్తాడు అనే వాదన లేకపోలేదు. దాంతో అట్లీ తో కానీ మురగదాస్ తో కానీ ఆయన తన తదుపరి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇంకొకవైపు ఈ ఇద్దరితో సినిమాలను ఒకేసారి మొదలుపెట్టి ఈ చిత్రాలను పూర్తి చేయనున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా బన్నీ తదుపరి సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఎక్కువ శాతం అభిమానులు మాత్రం అయన తదుపరి సినిమా బోయపాటి శ్రీను చేస్తే మంచిదని చెప్తునారు.

మరింత సమాచారం తెలుసుకోండి: