ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తర్వాత పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. పుష్ప ఒక్క సినిమాతో బన్నీ స్టార్ డం నేషనల్ వైడ్ గా పెరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య సొషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫైట్ జరుగుతుంది. ముఖ్యంగా ప్రభాస్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ మొదటి హీరోగా సౌత్ నుండి పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ ని ఆ రేంజ్ లో చూపించింది రాజమౌళి కాబట్టి ఆ క్రెడిట్స్ డైరక్టర్ కి ఇచ్చేస్తున్నారు.

ప్రభాస్ లాటరీ స్టార్ అని పాన్ ఇండియా ఇమేజ్ కేవలం రాజమౌళి వల్లే వచ్చిందని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమ హీరో అల్లు అర్జున్ రియల్ స్టార్ అని పుష్ప సినిమాలో తన నటనతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రభాస్ ఓ లాటరీ స్టార్ అని కామెంట్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. అయితే దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ రిప్లై ఇస్తున్నారు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా ప్రభాస్ కేవలం రాజమౌళి సినిమా వల్లే నేషనల్ స్టార్ అయ్యాడని.. అల్లు అర్జున్ తన నటనతో నేషనల్ హీరో అయ్యాడని చెప్పుకుంటున్నారు.

అయితే ప్రభాస్ వరుసగా ఆరేడు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ప్లాన్ చేశాడు. పుష్పతో బాలీవుడ్ లో సెన్సేషనల్ విక్టరీ అందుకున్న బన్నీ కూడా ఇక మీదట వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. లాటరీ స్టార్.. రియల్ స్టార్ అంటూ కొందరు ఫ్యాన్స్ ప్రభాస్, అల్లు అర్జున్ ల గురించి చెబుతున్నా సరే కొందరు ఫ్యాన్స్ మాత్రం వాళ్లిద్దరు బాగానే ఉంటారు.. మంచి ఫ్రెండ్స్ కూడా ఫ్యాన్స్ వాళ్ల మధ్య దూరాన్ని పెంచొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: