నాచురల్ స్టార్ నాని ఈమధ్యనే  శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నాని చాలా కొత్తగా ఉన్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలాఉంటే నానిసినిమా తర్వాత వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో మళయాళ భామ నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాని ఈమధ్యనే మొదలు పెట్టగా అప్పుడే షూటింగ్ పూర్తి చేసినట్టు చిత్రయూనిట్ వెల్లడించారు.

నాని అంటే సుందరానికీ చాలా ప్రత్యేకమైన సినిమాగా తెరకెక్కిస్తున్నాని తెలుస్తుంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరక్టర్ వివేక్ ఆత్రేయ ఈసారి నాని తో అంటే సుందరానికీ అంటూ ఓ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ఈ సినిమాని  శ్యామ్ సింగ రాయ్ సినిమా తరహాలోనే అన్ని సౌత్ ఇండియా భాషల్లో భారీగా రిలీజ్ చేస్తారని టాక్. అందుకే మళయాళ భామ నజ్రియాని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మళయాళ భామే అయినా నజ్రియాకి తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేయాలి అంటే నజ్రియా చాలా హెల్ప్ అవుతుందని ఆమెని ఫిక్స్ చేశారు.

సినిమా తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా వస్తుంది. నాని నుండి వస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్ గా దసరా వస్తుందని అంటున్నారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అనుకుంటున్నారు. నాని అంటే సుందరానికీ మాత్రం ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: