బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఓటీటీలో కూడా రికార్డులను దంచి కొడుతుంది. సిం హా, లెజెండ్ తర్వాత ఈ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీగా అఖండ అంచనాలను మించి రికార్డులను కొల్లగొట్టింది. థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ పై చెడుగుడు ఆడిన అఖండ ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడుతుంది. ఈ సినిమాలో స్పెషల్ మెషన్ గా థమన్ మ్యూజిక్ అదిరిపోయింది. మాములుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టే థమన్ అఖండ సినిమాకు నెక్స్ట్ లెవల్ లో బిజిఎం ఇచ్చాడు.

అఖండ సినిమా డిజిటల్ రిలీజ్ లో కూడా సెన్సేషన్లు క్రియేట్ చేస్తుంది. ఇక సినిమాని ఓటీటీ లో చూసి మ్యూజిక్ డైరక్టర్ థమన్ మీద బీభత్సమైన ప్రశంసలు చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ తో స్పీకర్లు బద్ధలవుతున్నాయంటూ పెద్దన్న సినిమాలో రజినీ వీడియోని రీ ఎడిట్ చేసి థమన్ నడుచుకుంటూ వస్తుంటే స్పీకర్లు బ్లాస్ట్ అవడం లాంటి వీడియో సిద్ధం చేశారు. దానితో పాటుగా అఖండ లో బాలకృష్ణ అఘోర అవతారంలో థమన్ ని ఫోటో మార్ఫింగ్ చేసి భం అఖండ పాట ఎడిట్ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా అఖండ సినిమా థమన్ మ్యూజిక్ గురించి చర్చించుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న థమన్ కి నిజంగా అఖండ లాంటి హిట్టు పడటం మరింత జోష్ ఫుల్ గా పనిచేసే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. ఓ విధంగా అఖండ కు థమన్ చాలా హెల్ప్ అయ్యాడని తెలిసిందే. అఖండ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు థమన్ మ్యూజిక్ గురించి ప్రస్థావించడం విశేషం.  అఖండ తర్వాత బాయ్య చేస్తున్న వరుస రెండు సినిమాలకు థమన్ నే మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు. తప్పకుండా రాబోయే సినిమాలతో కూడా థమన్ తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: