మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ వరుస అవకాశాలతో దుమ్ముదులిపేస్తుంది. సీనియర్ హీరోలే కాదు యువ హీరోలతో కూడా జత కడుతూ ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది తమన్నా. అంతేకాదు రెమ్యునరేషన్ లో కూడా తమన్నా తన స్టార్ క్రేజ్ కొనసాగిస్తుంది. ఇప్పటికీ అమ్మడితో సినిమా అంటే కోటిన్నర దాకా ఇవ్వాల్సిందే. కేవలం సినిమాల్లో ఫీమేల్ లీడ్ గానే కాదు స్పెషల్ ఐటం సాంగ్స్ కి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది.

రెండు దశాబ్ధాలుగా సౌత్ సినీ ప్రియులను అలరిస్తున్న తమన్నా తన పెళ్లి గురించి ఈమధ్య ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. అసలైతే ఈ ఏడాది మ్యారేజ్ చేసుకోవాలని భావించిన తమన్నా తన పెళ్లి ఆలోచనని మరో రెండేళ్లు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు ఉండటం వల్ల తమన్నా తన పెళ్లి ఆలోచనని మరో రెండేళ్లు పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. తమన్నా తర్వాత కెరియర్ ప్రారంభించి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న భామలంతా కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ తమన్నా మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దాదాపు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్న తమన్నా అందుకే బిఫోర్ మ్యారేజ్ వచ్చిన ప్రతి ఛాన్స్ చేసేయాలని చూస్తుంది. సీనియర్ హీరోలతో కూడా చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్న తమన్నా మరో రెండేళ్లు తెలుగు ఆడియెన్స్ ని అలరించడం పక్కా అని తెలుస్తుంది. అయితే తన దగ్గర పెళ్లి మ్యాటర్ ఎత్తకుండా తమన్నా అలా చెప్పింది కానీ ఆమె తన లైఫ్ లో స్పెషల్ పర్సన్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా తమన్నాకి అలాంటి స్పెషల్ పర్సన్ త్వరలోనే దొరకాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: