న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నుండి లేటెస్ట్ గా మరో డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమా నిడివి ఎక్కువ అయిన కారణంగా కొన్ని సీన్స్ ఫైనల్ వర్షన్ లో ట్రిం చేస్తారు. అలా రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమా నుండి ఫస్ట్ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు. వేశ్యలతో శ్యామ్ సింగ రాయ్ మాట్లాడే సీన్ అది కాగా లేటెస్ట్ గా వాసు శ్యామ్ సింగ రాయ్ జ్ఞపకాలను వెతుక్కుంటూ వెళ్లిన సీన్ ఒక రిలీజ్ చేశారు.

మొదటి సీన్ కన్నా వాసు శ్యామ్ సింగ రాయ్ జ్ఞాపకాలను తలచుకుంటూ వచ్చిన ఈ సెకండ్ డిలీటెడ్ సీన్ సినిమాలో ఉంటే చాలా బాగుండేదని అనిపిస్తుంది. ఈ డిలీటెడ్ సీన్ లో నాని తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. శ్యామ్ సింగ రాయ్ సినిమా నానిని నటుడిగా మరో మెట్టు ఎక్కించిందని చెప్పొచ్చు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా థియేట్రికల్ రన్ లో మంచి మౌత్ టాక్ తో హిట్ సొంతం చేసుకోగా డిజిటల్ రిలీజ్ లో ఇంకాస్త ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

అయితే సినిమా లెంగ్త్ ఎక్కువ అయిన కారణంగా శ్యామ్ సింగ రాయ్ సినిమా లో చాలా సీన్స్ ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా నుండి డిలీట్ చేసిన సీన్స్ అన్ని సినిమా ప్రొడక్షన్ బ్యానర్  నిహారిక ఎంటర్టైన్ మెంట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఫైనల్ మిక్సింగ్ అయిన సన్నివేశాలు కాబట్టి సినిమాలో క్లిప్పింగ్స్ లానే ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో ఉంచాల్సిన సీన్ కూడా లెంగ్త్ విషయమై కట్ చేశారని మాత్రం తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా డైరక్టర్ రాహుల్ కి అందరి దగ్గర నుండి భారీ ప్రశంసలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: