చలనచిత్ర పరిశ్రమలో ఏంతో మంది స్టార్ ల వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికి చాలా మందికి తెలియకపోవడం వలన వారి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది, అలా ఉండటం అనేది సహజం. ఎందుకంటే తెర మీద వాళ్ళు నటించిన పాత్రలలో తమని ఊహించుకుంటూ చాలా ప్రభావితం అవుతారు మన ప్రజలు. వారు పోషించిన పాత్రల్లాగే తెరవెనుక జీవితంలో కూడా వాళ్ళు అదే విధంగా ఆదర్శంగా ఉండాలి అని కోరుకొని ప్రేక్షకుడు ఉండడు. 



ఇంతకీ విషయానికి వస్తే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న అతి పెద్ద కుటుంబాల్లో దిగ్గజ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారి కుటుంబం ఒకటి. ఆయన కుమారులు సురేష్ బాబు , వెంకటేష్ లు సైతం తండ్రి ప్రోద్బలంతో చిత్ర పరిశ్రమలో కి అడుగుపెట్టి ఒకరు ప్రొడ్యూసర్ గా, మరొకరు హీరోగా విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆ కుటుంబానికి చెందిన మూడో తరం వాడైన రానా అయితే హీరోగా మెప్పిస్తూనే విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని భాషల ఇండస్ట్రీలలో రాణిస్తున్నారు. ఇంతకీ రానా దగ్గుబాటి తల్లి ఎవరో తెలుసా ? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా ?  




రానా దగ్గుబాటి తల్లి అదే సురేష్ బాబు గారి సతీమణి లక్ష్మీ గారి పుట్టింటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. లక్ష్మీ గారు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, యలమర్తి నారాయణ రావు చౌదరి గారి అమ్మాయి, మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త దివంగత వై.టి.రాజా గారి సోదరి. అంతేకాకుండా ఆంధ్ర బిర్లా గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి మేనకొడలు. ప్రముఖ సోషలిస్టు దిగ్గజ రాజకీయ నాయకులు , దివంగత జాగర్లమూడి చంద్రమౌళి గారు వీరి పెదనాన్న. 



లక్ష్మీ గారి పెళ్లి సురేష్ బాబు గారితో జరగడానికి చంద్రమౌళి గారు ముఖ్య కారణం. చంద్రమౌళి గారికి నిర్మాత రామానాయుడు గారు దగ్గరి బంధువు. సురేష్ బాబు వివాహాం చేయడానికి అమ్మాయి కోసం వెతుకుతున్న సమయంలో ఒక కుటుంబ వేడుకలో మాటల్లో భాగంగా లక్ష్మీ గారిని చూసి వివరాలు తెలుసుకోగా చంద్రమౌళి గారి తోడల్లుడు నారాయణ రావు చౌదరి గారి కుమార్తె తెలుసుకున్న వెంటనే చంద్రమౌళి గారితో సంప్రదింపులు జరిపి వారి అంగీకారంతో నారాయణ రావు గారు సైతం అంగీకరించారు. అప్పుడే అమెరికాలో మాస్టర్స్ చేసి ఇండియా తిరిగి వచ్చిన సురేష్ బాబు వెంటనే పెళ్లి చేసుకున్నారు. 

లక్ష్మీ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత సురేష్ బాబు గారికి అదృష్టం బాగా కలిసి వచ్చి ఇండస్ట్రీలో నిర్మాత గా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. లక్ష్మీ గారు సైతం రామానాయుడు స్టూడియో నిర్వహణలో భాగమై ఇప్పటి వరకు తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సురేష్ బాబు, లక్ష్మీ దంపతులకు హీరో రానా తో పాటుగా కుమార్తె మాళవిక , కుమారుడు అభిరామ్ ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: