ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించాడని చెప్పడంలో సందేహం లేదు. సౌత్ నుండి ముఖ్యంగా తెలుగు నుండి నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ గా అల్లు అర్జున్ పుష్ప తో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటన హిందీ మాస్ ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది. పుష్ప పార్ట్ 1 కే పరిస్థితి ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2 ది రూల్ తో అల్లు అర్జున్ మరింత భారీ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

సినిమా తర్వాత బన్నీ అసలైతే వేణు శ్రీరాం తో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. కానీ పుష్ప అంచనాలను మించి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా నెక్స్ట్ సినిమా ప్లానింగ్ మార్చేశాడు అల్లు అర్జున్. లేటెస్ట్ న్యూస్ ప్రకారం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీతో సినిమా చేస్తాడని టాక్. లైకా ప్రొడస్ఖన్స్ ఈ కాంబో ఫిక్స్ చేసే పనిలో ఉందట. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా అలియా భట్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. rrr సినిమాతో సౌత్ ఆడియెన్స్ కి అలియా భట్ దగ్గర కానుంది. తప్పకుండా అమ్మడికి ఇక్కడ అదరగొట్టడం ఖాయం.

ఇక మన స్టార్స్ చేసే పాన్ ఇండియా సినిమాలకు అలియా భట్ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అట్లీ.. అల్లు అర్జున్.. అలియా భట్ ఈ కాంబో నిజంగానే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ తో అలియా జోడీ కడితే ఆ సినిమా మరింత స్పెషల్ గా ఉంటుదని అంటున్నారు. అలియా భట్ ఇప్పటికే సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇక అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ కూడా అందుకుంటే మాత్రం అలియా భట్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: