అక్కినేని నాగచైతన్య వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ ను చక్కదిద్దు కుంటూ అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విజయ పరంపర ఇప్పుడు ఆయనకు దక్కుతుంది అని చెప్పాలి. లవ్ స్టోరీ చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన మూడు నెలల వ్యవధిలోనే బంగార్రాజు చిత్రంతో కూడా ఆయన సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ విధంగా చైతు వరుస సక్సెస్ లతో గాడిలోకి పడగా నాగార్జునకు అతని నుంచి ఇప్పుడు లేదనే చెప్పాలి. నటన పరంగా కూడా నాగ చైతన్య బాగా ఇంప్రూవ్ అయ్యాడు అనే పేరు తెచ్చుకోవడం అక్కినేని అభిమానులను ఎంతగానో ఆనంద పరుస్తుంది.

దీనికి తోడు తన తదుపరి సినిమాల లైనప్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో అందరూ చైతన్యకు మళ్లీ మళ్లీ హిట్లు దక్కడం ఖాయమని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున టెన్షన్ ఒకే ఒకటి. అదే అక్కినేని అఖిల్ కెరియర్. ఎన్నో అంచనాలు పెట్టుకొని భారీ స్థాయిలో తన చిన్న కొడుకు సినిమా నీ లాంచ్ చేశాడు నాగార్జున. అయితే అనూహ్యంగా ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం భారీ ఫ్లాప్ కావడంతో అక్కినేని అభిమానుల తో సహా నాగార్జున కూడా ఎంతో నిరాశ పడ్డారు.

సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించక పోవడంతో క్లాస్ సినిమా చేసి ప్రేక్షకులను ఆనంద పరచాలి అని భావించి రెండవ సినిమా హాలో చేయగా అది కూడా అందరిని నిరాశపరిచింది చెప్పాలి. ఇక మూడో సినిమా సంగతి సరేసరి. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెపించలేదు. దాంతో ఆయన కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితులలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాపాడిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏజెంట్ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అయితే అఖిల్ కు ఎదురు ఉండదు అని వార్తలు వస్తుండడంతో అఖిల్ ఈ సినిమాతో హిట్ కొడతాడా అనేది ఇప్పుడు అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. అన్నలాగే అఖిల్ కూడా హిట్ జోష్ కంటిన్యూ చేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: