భారతదేశ సినిమా పరిశ్రమలో పుష్ప సినిమా ఒక అధ్యాయం లిఖించుకుంది అని చెప్పవచ్చు. ఈ స్థాయిలో ఓ సినిమా దేశ ప్రజలు అందరినీ ఆకర్షించడం అంటే ఆ సినిమా ఎంతటి స్థాయిలో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక దక్షిణాది సినిమాకు ఉత్తరాదిన కూడా ఇంతటి స్థాయిలో ఆదరణ దక్కడం ఇదే తొలిసారి కావచ్చు. గతంలో కొన్ని సినిమాలు సౌత్ సినిమాలపై ఇంట్రస్ట్ క్రియేట్ చేయగా ఇప్పుడు సౌత్ సినిమా పరిశ్రమ ఉత్తరాది సినిమా పరిశ్రమను డామినేట్ చేయడం మొదలు పెట్టింది.

అలా అల్లు అర్జున్ కు ఈ సినిమా ద్వారా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడం, ఆ సినిమా ఆయనను పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నగా మొదటి భాగం మాత్రమే ఇంతటి స్థాయిలో సంచలనం సృష్టిస్తే ఇక రెండవ భాగం ఇంకా ఎంతటి స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో అని అంచనాలు ఇప్పటి నుంచే ప్రేక్షకులలో ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగానే సినిమా బృందం కూడా రెండవ పాత్ర హైలెట్ అయ్యే విధంగా ఉండాలని ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే అనూహ్యంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓటీటీ రేటు రావడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారు అనే అందరూ అనుకోగా అలాంటిది ఆయనకు ఓ టీ టీ ఆఫర్ రావడం ఏంటి అని వారు కొంత ఆశ్చర్యం వ్యక్తం చేయగా అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడమే మంచిదని దర్శక నిర్మాతలకు సూచించారట. అలా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కావడం ఖాయం మరి. ఈ సంస్థలు భారీగా ఆఫర్ చేస్తే కనుక వారు ఏ నిర్ణయం తీసుకునేది ఎవరికీ తెలియదు. వచ్చే ఏడాది సంక్రాంతికి పుష్ప సినిమా విడుదల అవుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: