మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రవితేజ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు,  అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో రవితేజ వరుస క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొద్ది రోజుల క్రితమే తెలియజేసింది.

అయితే రవితేజ పుట్టిన రోజు అయిన జనవరి 26 వ తేదీన ఈ సినిమా నుండి ఒక  సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం  తెలియజేసింది.  రవితేజ ఈ సినిమాతో పాటు  రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయక వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది, అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రవితేజ పుట్టినరోజు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు రవితేజ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో కూడా నటించబోతున్నాడు, అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు, ఈ రెండు సినిమాకు సంబంధించిన అప్డేట్ లు కూడా రవితేజ పుట్టినరోజు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: