దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవగన్, సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఇప్పటికే ఈ సినిమా నుండి  కొన్ని  ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై  ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

 అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కారోనా కేసులు  ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది, అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను  మార్చి 18 వ తేదీన లేదా, ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు  చిత్ర బృందం ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాదే శ్యామ్ ఈ సినిమాను కూడా కొన్ని రోజుల క్రితం జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, అయితే దేశంలో కారోనా  కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను  కూడా చిత్ర బృందం వాయిదా వేసింది, అయితే ఇప్పటి వరకు కూడా ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు, అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఒకవేళ ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18 వ తేదీన విడుదల చేసినట్లు అయితే ఏప్రిల్ 28 వ తేదీన రాదే శ్యామ్ సినిమాను విడుదల చేయాలని ఒకవేళ ఏప్రిల్ 28 వ తేదీన ఆర్ఆర్ఆర్ ను విడుదల చేసినట్లు అయితే మార్చి 18 వ తేదీన రాధే శ్యామ్ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: