అందాల ముద్దుగుమ్మ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఇలా హ్యాపీ డేస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి,  అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు వెంకటేష్,  వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది,  ఇవి మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా తమన్నా నటిస్తోంది.

 ఇలా తమన్నా కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది, ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించిన తమన్నా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా టీవీ షో లకు కూడా మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా వ్యవహరించింది, ఈ మధ్యనే మాస్టర్ చెఫ్ అనే టీవీ షో కు తమన్నా  హోస్ట్ గా వ్యవహరించింది. ఇలా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులను బట్టి మిల్కీ బ్యూటీ తమన్నా తనను తాను అప్డేట్ చేసుకుంటు వరుస ఆఫర్ లతో ఫుల్ బిజీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: