వెంకటేశ్‌ మూడున్నర దశాబ్దాలుగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే ఇంత లాంగ్‌ కెరీర్‌లో వెంకీ ఎప్పుడూ లాంగ్‌ స్పీచ్‌ ఇచ్చింది లేదు. ఆడియో ఫంక్షన్, సక్సెస్‌ మీట్‌ ఏదైనా సరే వెంకీ షార్ట్‌ అండ్‌ స్వీట్‌ అన్నట్లుగానే స్పీచ్ ఇస్తుంటాడు. మాటలని డబ్బుల్లా చాలా పొదుపుగా వాడే వెంకటేశ్‌ ఇప్పుడు ఒక షోకి హోస్ట్‌గా మారుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌ భారీగా పెరిగారు. ఇక అల్లు అరవింద్‌ కూడా ఈ ట్రెండ్‌ని క్యాష్‌ చేసుకుంటూ 'ఆహా'ని మరింత విస్తరించడానికి స్టార్స్‌ని దింపుతున్నాడు. ఎప్పుడూ పెద్దగా మాట్లాడని వెంకటేశ్‌తో ఒక టాక్‌షోకి ఏర్పాట్లు చేస్తున్నాడట అల్లు అరవింద్.

ఫిల్టర్స్‌ లేకుండా మాట్లాడే బాలకృష్ణ ఒక టాక్‌షో చేస్తాడని ఇండస్ట్రీలో ఎవరూ ఊహించలేదు. అసలు బాలయ్యతో టాక్‌షో చేయించాలనే ఆలోచన కూడా మెజారిటీ క్రియేటర్స్‌కి వచ్చి ఉండదని చాలామంది అంటుంటారు. కానీ మెగాప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ మాత్రం బాలకృష్ణతో అన్‌స్టాపబుల్‌ అనే టాక్‌షో చేయిస్తున్నాడు. బాలయ్య టైమింగ్‌తో 'అన్‌స్టాపబుల్' టాక్ షో సూపర్ హిట్ అయ్యింది. ఐఎమ్‌డిబి ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో అయిదో స్థానం సాధించింది 'అన్‌స్టాపబుల్'. ఇక ఈ టాక్‌ షోతో 'ఆహా' మార్కెట్‌ కూడా పెరిగిందని టాక్. అందుకే నెక్ట్స్‌ వెంకటేశ్‌ని రంగంలోకి దింపుతున్నాడట అల్లు అరవింద్. ఆల్రెడీ వెంకీ 'రానా నాయుడు' అనే వెబ్‌ సీరీస్‌కి సైన్‌ చేశాడు. ఇక ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్నాడు వెంకీ.

తెలుగునాట సీనియర్‌ హీరోల్లో టీవీషోస్‌లోకి వచ్చిన ఫస్ట్‌ స్టార్ నాగార్జున. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' తెలుగు వెర్షన్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోతో బుల్లితెరపైకి వచ్చాడు. హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌గా సూపర్‌ సక్సెస్‌ రేట్‌ ఉన్న నాగార్జున, హోస్టింగ్‌లోనూ సూపర్‌ అనిపించుకున్నాడు. కోటీశ్వరుడులో మూడు సీజన్స్‌కి హోస్టింగ్‌ చేశాడు. ఇక ఈ సక్సెస్‌ రేట్‌తోనే జూ.ఎన్టీఆర్, నాని వెళ్లిపోయాక 'బిగ్‌బాస్' బాధ్యతలు తీసుకున్నాడు. మూడు సీజన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేశాడు. నాగార్జున తర్వాత చిరంజీవి కూడా టీవీషోస్‌లోకి వచ్చాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్‌ 4 కి టాలీవుడ్‌ మెగాస్టార్ హోస్టింగ్ చేశాడు. మెగాస్కిల్స్‌తో తన మార్క్ చూపించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: