గత రెండు రోజులుగ సోషల్ మీడియాలో డైరక్టర్ మారుతి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కు సంబందించిన న్యూ ఒకటి వైరల్ గా మారింది. ప్రభాస్ లిస్ట్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉండగా మారుతి కూడా ఆ లిస్ట్ లో చేరాడని అన్నారు. ఇదే విషయంపై మారుతి కూడా ఆ టైం వస్తే అన్ని తెలుస్తాయ్ అన్నట్టుగా అన్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మారుతితో సినిమా అంటే వద్దంటే వద్దని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అందుకే మారుతి కూడా తన ఆలోచన మార్చుకున్నాడని తెలుస్తుంది. మారుతి, ప్రభాస్ కోసం వినిపిస్తున్న రాజా డీలక్స్ సినిమా ఇప్పుడు మాస్ మహరాజ్ రవితేజతో చేస్తాడని టాక్.

రాజా టైటిల్ తో రవితేజకి మంచి రిలేషన్ ఉంది. రాజా ది గ్రేట్.. డిస్కో రాజా.. లాంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు రాజా డీలక్స్ కూడా రవితేజకి లక్కీ ప్రాజెక్ట్ కానుంది. అసలైతే అంతకుముందే మారుతితో రవితేజ సినిమా చేయాల్సి ఉన్నా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇప్పుడు మారుతి రాజా డీలక్స్ లో రవితేజ హీరోగా చేస్తాడని చెబుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చే ఈ రాజా డీలక్స్ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయిందని టాక్. ప్రభాస్ నో అంటే మాత్రం రవితేజతో రాజా డీలక్స్ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెల్తున్నారు. ఖిలాడి, రమారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటుగా రాజా డీలక్స్ కూడా వస్తే మాత్రం రవితేజ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మాస్ రాజా రవితేజ క్రాక్ తో లాస్ట్ ఇయర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. రానున సినిమాలతో తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.. ఖిలాడి సినిమా రమేష్ వర్మ డైరక్షన్ లో చేస్తుండగా.. శరత్ మండవతో రామారావు.. సుధీర్ వర్మతో రావణాసుర చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: