సమంత మరో ఐటెం సాంగ్ చేయనుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరీర్‌లో మరింత ముందుకు దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఏ ప్రాజెక్ట్ చేసినా హాట్ టాపిక్ అవుతోంది. ఎట్టకేలకు హీరోయిన్ గా కెరీర్ ముగింపు దశకు వచ్చిందని అనుకుంటున్న తరుణంలో సమంత తన క్రేజ్ ను డిఫరెంట్ రేంజ్ లో పెంచుకుంటోంది. గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా నటిని వీలైనంత వరకు తనలోంచి బయటకి లాగుతుంది. బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తుండటంతో ఆమె మెల్లగా అటువైపు దృష్టి సారిస్తోంది. రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సామ్.. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అసలు విషయంలోకి వస్తే. ఇక సమంత మరిన్ని ఐటెం సాంగ్స్ చేయడానికి రెడీ అయిందనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. విజయ్ దేవరకొండ కూడా సామ్‌తో స్టెప్పులు వేయనున్నాడని వార్తలు వచ్చాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లీగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. సమంతను పుష్పా పద్దతిలో తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియదు. అయితే పుష్ప తర్వాత సమంతతో మరో పాన్ ఇండియా మూవీలో ఐటెం సాంగ్ చేయడంపై లైగర్ యూనిట్ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. పుష్ప తర్వాత సమంత మరో ఐటెం సాంగ్‌కు అంగీకరించిందా లేదా అనేది ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సమంత యశోద ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఆమె ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులతో యాక్షన్ వెబ్ ఫిల్మ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ఇప్పటికే శకుంతలం ప్రాజెక్టును పూర్తి చేసింది. ఏది ఏమైనా సమంత భవిష్యత్తు చీకట్లోకి వెళ్లి పోతుందన్న  సమయంలో రెండడుగులు వెనక్కి వేసి పంజా విసిరే  సింహంలా దూసుకుపోతున్నదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: