దేశంలో కరోనా పుణ్యమా అని సినిమా థియేటర్లకు వెళ్లేందుకు జనాలు కాస్త తగ్గుముఖం పట్టారు. ఈ తరుణంలోనే చాలా మంది జనాలు ఓటీటీల్లో సినిమాలను చూసేందుకే మొగ్గు చూపుతున్నా విషయం అందరికి తెల్సిందే. ఇక నేటిసమాజంలో ఉన్న పరిస్థితుల్లో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువగా ఉన్నాయి. ఇక చాలా మంది ఫోన్ లోనే సినిమాలను వీక్షిస్తున్నారు. అంతేకాక.. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు ఓటీటీనే దిక్కైంది.

అయితే ఈ వారం ఆహాలో విడుదలైయ్యే సినిమాలు ఎంతో ఒక్కసారి చూద్దామా. ఇక దర్శకుడు తేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్ లో వచ్చిన అర్జున ఫల్గున సినిమా జనవరి 28న స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.. ఓటిటిలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.

ఇక ఈ వారం హాట్‌ స్టార్ లో మలయాళం మూవీ బ్రో డాడీ జనవరి 26న స్ట్రీమ్ అవుతుండగా.. హిందీ మూవీ తడప్ జనవరి 28న స్ట్రీమ్  అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జనవరి 25న ద ప్రామిస్‌ ల్యాండ్‌ అనే వెబ్ సిరీస్, ద గిల్డెడ్‌ ఏజ్‌ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ విషయానికి వస్తే.. జనవరి 28న కొరియన్‌ సిరీస్‌ ఆల్‌ ఆఫ్‌ అజ్‌ ఆర్‌ డెడ్‌, గెట్టింగ్‌ క్యూరియస్‌ విత్‌ జొనాథన్‌ వాన్‌నెస్‌ అనే వెబ్‌ సిరీస్‌ విడుదల కానున్నాయి. అంతేకాక.. హోమ్‌ టౌన్‌ అనే హాలీవుడ్‌ మూవీ కూడా జనవరి 28న అవుతుంది.

అలాగే జనవరి 25న స్పోపియర్స్‌ అనే వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాగా, జనవరి 26న ద సిన్నర్‌ అనే సిరీస్ సీజన్ స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. ఇక జనవరి 27న ప్రేమ్డ్ అనే వెబ్ సిరీస్, జనవరి 28న ఫెరియా అనే హాలీవుడ్ మూవీ విడుదల కానున్నాయి. కాగా.. జీలో ఈ వారం  జనవరి 26న మలయాళ మూవీ ఆహా, జనవరి 28న హిందీ సిరీస్ పవిత్ర రిష్తా స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: