అఖండ.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రోజు రోజుకు మరింత ప్రేక్షకాదరణ పొందుతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో సైతం మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. అంతే కాదు ఈ సినిమా దేశ విదేశాలలో కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల రోజు విదేశాలలో అయితే ఏకంగా థియేటర్ల ముందు బాలయ్య కి  సంభందించి అతిపెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి పూజలు కూడా నిర్వహించారు. ఇక థియేటర్లలో మారుమోగిన ఈ సినిమా.. ఇప్పుడు టీవీలలో దర్శనమిస్తోంది.. మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు థియేటర్కు వెళ్ళలేని వారికి ఓటీటీ వేదిక గా జనవరి 21వ తేదీన విడుదల కాగా బుల్లితెరపై కూడా ప్రసారం అవుతూ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో బహిరంగ ప్రదేశంలో భారీ టీవీ ఏర్పాటు చేసి ఆ ఊరి ప్రజలంతా సినిమాలు వీక్షించిన విషయం అందర్నీ ఆశ్చర్యపరిచగా.. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలోని.. కూనమనేని వారి పాలెం అనే గ్రామంలో ఊరంతా కలిసి 'అఖండ' సినిమాని చూశారు. అంతే కాదు ఈ సినిమా చూడడానికి ఆ గ్రామ ప్రజలంతా తమ ఊర్లో భారీ  తెరను ఏర్పాటు చేసి 'అఖండ' సినిమాని ప్లే చేశారు. దీంతో అక్కడ వాతావరణం అంతా పండుగలా మారిపోయింది.

ఇప్పటికే రెండు గ్రామాల ప్రజలు మొత్తం కలిసి సినిమాను వీక్షించడం తో హాట్ టాపిక్ గా మారిన ఈ విషయం, మరి ఇంకా ఎన్ని గ్రామాల ప్రజలు ఇలా ఊరంతా కలిసి సినిమాలు చూస్తారో తెలియాల్సి ఉంది. ఇక పోతే ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండి ఎవరి ఇళ్లలోనే వారు సినిమాలు చూడాలి అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఏదిఏమైనా అఖండ సినిమాకి క్రేజ్ మాత్రం ఇప్పటి వరకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దక్కడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: