టాలీవుడ్ సీనియర్ హీరో 'కింగ్' నాగార్జున ఇంకా అలాగే యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా సీనియర్ బ్యూటీ రమ్య కృష్ణ, జూనియర్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బంగార్రాజు'.'జీ స్టూడియోస్' ఇంకా అలాగే 'అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్' బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ సినిమా 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన' కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా 'బంగార్రాజు' సినిమా విడుదలయ్యింది.ఈ సినిమాకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ అయితే బాగానే నమోదయ్యాయి.కానీ వీక్ డేస్లో మాత్రం 'బంగార్రాజు' సినిమా స్లో అయ్యిందనే చెప్పాలి. నైజాం ఏరియాలో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనీసం కూడా లేవనే చెప్పాలి. అంతలా డ్రాప్ అయ్యాయి. ఇక ఒకసారి ఈ సినిమా 11 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే..

నైజాం : 5L
సీడెడ్ : 8L
UA: 8L
ఈస్ట్ : 5L
వెస్ట్ : 3L
గుంటూరు : 3L
కృష్ణ : 2L
నెల్లూరు : 2L

ఇక 'బంగార్రాజు' సినిమాకి రూ.38.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.32.75 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక బ్రేక్ ఈవెన్ కు ఈ సినిమా మరో రూ.5 కోట్ల పైన షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో సోమవారం నాడు ఈ సినిమా జోరు చాలా వరకు తగ్గిపోయింది.ఓపెనింగ్స్ బట్టి చూస్తే ఈ సినిమా రూ.100కోట్లు గ్రాస్ కొట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు.

కానీ ఆంధ్ర ప్రదేశ్ లో 50 ఆక్యుపెన్సీ అలాగే కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా 'బంగార్రాజు' సినిమా కలెక్షన్లు డల్ అయినట్టు పూర్తిగా స్పష్టమవుతుంది.నైజాంలో అయితే చాలా డ్రాప్ అయ్యాయి.అయితే ఈ సినిమాకి పోటీగా క్రేజ్ ఉన్న సినిమాలు లేవు కాబట్టి.. బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు 'బంగార్రాజు' సినిమాకి అవకాశాలు ఉన్నాయి. అయితే నైజాం ఏరియాలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం మాత్రం కష్టమే.అనిపిస్తుంది. కాని చూడాలి ఈ వీకెండ్ కి ఎంత వసూళ్లు రాబడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: