టాలీవుడ్ సీనియర్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి దుమ్మురేపింది.బోయపాటి బాలయ్య కాంబినేషన్లో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడింది అయితే ఇక ఇప్పుడు ఎక్కడవిన్నా బాలయ్య మాస్ జాతర అఖండ గురించే టాక్.ఇక గతేడాది థియేటర్లో రిలీజ్ అయిన ఈ అఖండ సినిమా ఓటిటీలోను అంతే వేగంగా దూసుకుపోతుంది. ఎక్కడ విన్నా... చూసిన కూడా బాలయ్య నటనను, థమన్ మ్యూజిక్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అంతేకాకుండా వీటిని చూసిన మ్యానియాని చూసి హిందీ ప్రేక్షకులు ఈ సినిమాపై మనసుపారేసుకోడమే కాకుండా తెగ ఇష్టపడుతున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా  సౌత్ సినిమాలు నార్త్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి... దాంతో పాటు హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాల వైపు తొంగిచూస్తున్నారు.అంతే కాకుండా తాజాగా బన్నీ నటించిన తాజా చిత్రం పుష్ప  హిందీలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే  బాలీవుడ్ అభిమానులు అఖండ హిందీ వెర్షన్ కావాలని మంకు పట్టు పట్టుకొని కూర్చున్నారట.అయితే తాజాగా 'అఖండ’ సినిమా హిందీ వెర్షన్ ను తీసుకు రావాలని... లేదంటే హిందీలో ‘అఖండ’ ను రీమేక్ అయినా చేయాలి అని.... చాలా మంది డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

అంతేకాకుండా మేము మాత్రం మనుషులం కదా.. మీరు అనుభవించిన ఆ అనుభూతిని  మేము మాత్రం  అనుభవించకూడదా..? అంటూ నెటిజన్స్ మేకర్స్ కి, ఫ్యాన్స్ కి కామెంట్స్ పెట్టడం జరుగుతుంది.సినిమాలో బాలయ్య నటనను చూడాలని మాకు మాత్రం ఉండదా అంటూ దీనంగా అడుగుతున్నారు.అయితే  బాలీవుడ్ అభిమానుల కోసం అఖండ మేకర్స్ ‘అఖండ’ సినిమా హిందీ వెర్షన్ ను తీసుకువస్తారా..? లేదా రీమేక్ ప్లాన్ చేస్తారా..? అనేది చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: