సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా  సెలబ్రిటీల మధ్య లవ్ ట్రాక్ ఏదో నడుస్తోంది అంటే అది అందరికీ ఎంతో ఆసక్తికరంగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బుల్లితెరపై  అందరికీ ఎంతోఆసక్తికరం గా మారిపోయిన జోడి ఏదైనా ఉంది అంటే అది సుడిగాలి సుధీర్ రష్మీ ఢీ జోడి అనే చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఈ జోడి  బుల్లితెర మొత్తం ఎక్కడ చూసినా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోతుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతి షో లో సుడిగాలి సుధీర్ రష్మీ ఢీ జోడి కనిపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇటీవల సుడిగాలి సుధీర్ రష్మీ ఢీ జోడిని బీట్ చేసేందుకు అటు రవి కృష్ణ నవ్య స్వామి జోడి ప్రస్తుతం ఇటీవలి కాలంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. బిగ్బాస్ కార్యక్రమం నుంచి బయటికి వచ్చిన రవి కృష్ణ  అటు మాటీవీలో నవ్య స్వామి హీరోయిన్ గా నటించిన ఒక సీరియల్లో నటించడంతో.. ఇక వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.  ఇద్దరు ఎంతో క్లోజ్ గా మారిపోయారు. దీంతో రవికృష్ణ నవ్య స్వామి ప్రేమలో ఉన్నారని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారుఅంటూ ట్రాక్ రావడం మొదలైంది.


 అంతా బాగానే ఉంది కానీ నవ్య స్వామి రవికృష్ణ తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెబుతూ ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ జంట ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ షో లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ఎప్పటిలాగానే సందడి సందడి గా మారిపోయింది.. కానీ ఇక ఈ ప్రోమో చివర్లో ఏకంగా రవికృష్ణ నవ్య స్వామి ఒకరికి ఒకరు బ్రేకప్ చెప్పుకుంటూ ఉండడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం చూస్తే వీరిద్దరూ కేవలం ప్రోమో లో భాగంగా బ్రేకప్ చెప్పుకున్నారా లేక నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నా అది ప్రేక్షకుల్లో కన్ఫ్యూషన్ చేరిపోయింది. ఇక ఈ కంక్లూజన్ పై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv