ప్రస్తుతం ఆమె తన సోదరుడితో కలిసి ఓ క్యాస్టింగ్ ఏజెన్సీ ని పెట్టి బిజినెస్ చేయబోతుంది అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఆ వ్యాపార వ్యవహారాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నట్లు గా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు బాలీవుడ్ లో కూడా ఈమెను ఏ హీరో కూడా పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా కెరియర్ అర్ధాంతరంగా అయిపోయింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాను కూడా ఇక సినిమా అవకాశాల కోసం తిరగడం అనవసరం అనుకున్నదో ఏమో ఇప్పుడు ఈ బిజినెస్ మొదలు పెట్టింది.
అయితే మధ్యలో ఎవరో ఆమెను బాగా ఇన్ స్పైర్ చేసినట్లు ఉంది. దాంతో ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఆమె పని చేసిన హీరోలు దర్శకులు నిర్మాతలతో టచ్ లోకి వెళ్లి తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందిగా వేడుకుంటుందట. ఆ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ తన సినిమా కెరీర్ గాడిలో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు ఆమె ఆవేదనను అర్థం చేసుకుని మేకర్స్ ఎవరైనా ఛాన్స్ ఇస్తారో చూడాలి. బాలీవుడ్ లో ఆమె చేతిలో ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఆమెను హీరోయిన్ గా మంచి స్థానానికి వెళతాయా అనేది చూడాలి. మరి ఆమెకు మునుపటి క్రేజ్ ఎలా వస్తుందో అనేది చూడాలి.