పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ ను తలదన్నే హీరో ఇప్పటి వరకు రాకపోవడంతో అందరూ కూడా ప్రభాస్ తో సినిమా చేయాలనే విధంగా ప్రయత్నాలు చేశారు. వారిలో బాలీవుడ్ నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రాన్ని బాలీవుడ్ లో చేస్తున్నాడు ప్రభాస్. ఆ తర్వాత కూడా మరింత మంది బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేసే విధంగా ఆయన వెంట పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప సినిమా భారీ సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రభాస్ కాదన్న నిర్మాతలు అల్లు అర్జున్ తో సినిమా చేసే విధంగా వస్తుండటం విశేషం. 

పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ఇప్పుడు ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నిదర్శనం. మొదట్లో ఈ చిత్రానికి ఇంత బాగా పేరు ప్రఖ్యాతలు రాకపోయినా కూడా పుష్ప సినిమా ఓ టీ టీ లో విడుదలైన తర్వాత అందరు కూడా ఈ చిత్రాన్ని విజయవంతం చేశారు అని చెప్పవచ్చు. ఇంతవరకు ఎటువంటి చిత్రానికి కూడా ఈ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది లేదు. ఎందుకంటే క్రికెటర్లు సైతం ఈ సినిమా పాటలను పాడుతూ వీడియోలు చేసి అందరికీ షేర్ ఉండడం విశేషం. అలా భారీ ఇమేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఇప్పుడు భారీ స్థాయిలో నిర్మాతలు క్యూ కడుతున్నారట.

ఏదేమైనా వరుసగా రెండవ తెలుగు హీరో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కుర్చీలో కూర్చోవడం విశేషం. అలా ప్రభాస్ కు వెళుతున్న కొన్ని ప్రాజెక్టులు అల్లు అర్జున్ రావడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుందట ప్రేక్షకులకు. ప్రస్తుతం పుష్ప రెండవ భాగం సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టి ఆ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో విజయం తెచ్చుకోవాలని భావించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఏ సినిమా ఒప్పుకోవడం లేదట కానీ ఆయన పీఆర్ ల బృందం మాత్రం ఆయన చేసే తదుపరి సినిమాలు యొక్క లిస్టు ను తయారు చేస్తున్నరట. అందులో ఎక్కువగా బాలీవుడ్ నిర్మాతలు ఉండటం బన్నీ కి పెరిగిన డిమాండ్ ను ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: