సినిమా పరిశ్రమ లో కాపీ కొట్టడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఒక సీన్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయి కొంతమంది దర్శకులు ఆ తరహాలోనే తమ సినిమాలోని సీన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కథ ను విని ఇన్ స్పైర్ అయ్యి ఆ కథ తరహాలోనే మరొకటి కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వాటిని మక్కీకి మక్కీ కాకుండా తమదైన టాలెంట్ ను జోడించి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అసలు విషయం ప్రేక్షకులకు తెలియని  విధంగా చేసి హిట్ కొడతారు. అలాంటిదే పుష్ప సినిమా విషయం లో జరిగింది అని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా లోని ఒక పాయింట్ బాహుబలి సినిమా లోని ఒక పాయింట్ ను పోలి ఉంటుంది అని ఇప్పుడు వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ స్థాయిలో విజయం అందుకోగా ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం నిజంగా ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు సుకుమార్ ఏ విధమైన కాపీ మరకలను ఎరుగలేదు. అందరి కంటే డిఫరెంట్ కథలను ఎంచుకుని సినిమాలను చేస్తూ భారీ స్థాయిలో వాటితో హిట్స్ అందుకుంటూ ముందుకు వెళతాడు సుకుమార్. అలాంటిది ఆయన పుష్ప సినిమా విషయంలో ఇలా ఎందుకు చేస్తాడు అని కొంతమంది వాదనలకు దిగుతున్నారు.

సినిమా రెండవ భాగంలో అల్లు అర్జున్ ను వెన్నుపోటు పొడుస్తారు అనే పాయింట్ ఉండబోతున్న ట్లుగా తెలుస్తుంది. వెన్నుపోటు అనగానే మనందరికీ తప్పకుండా బాహుబలి సినిమా గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో బాహుబలి ఎంతగానో నమ్మిన కట్టప్ప వెన్నుపోటు పొడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే ట్విస్ట్ కూడా.. అలా ఈ సినిమాలో అల్లు అర్జున్ ను ఓ పాత్ర వెన్ను పోటు పొడవడం ఇప్పుడు ఆ సినిమాను పోలి ఉంటుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ పాత్రను ఎవరు చేశారు అనేది చూడాలి. సుకుమార్ బాహుబలి సినిమా పోలిక లేకుండా దాన్ని ఏ విధంగా మలచాడు అనేది ఏ సినిమా విడుదలైన తర్వాత చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: