సినిమా పరిశ్రమలో ఎవరి టైం ఎప్పుడు, ఎవరి దశ ఎప్పుడు మారుతుందో ఎవరు చెప్పలేదు. వారు తమకు వచ్చిన సమయంలోనే భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలి. అలా ప్రస్తుతం సంగీత ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు తమన్. టాలీవుడ్ లో  ఇంతటి స్థాయిలో ఆయన కు క్రేజ్ ఎప్పుడు రాలేదనే చెప్పాలి. గత రెండు సంవత్సరాలుగా ఆయన సంగీతం అందిస్తున్న సినిమాలు భారీ స్థాయిలో హిట్ అవ్వడంతో పాటు ఆయన సంగీతానికి కూడా మంచి పేరు రావడంతో ఇప్పుడు ఈ స్థాయిని ఆయన అనుభవిస్తున్నాడు.

తొందరలోనే తమ ప్రతిభ ఇతర భాషలలోకి కూడా చేరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ పై ఆయనకు నెగిటివ్ ఉద్దేశ్యం ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో అయిన బాలీవుడ్ లో సినిమా చేసి భారీ స్థాయిలో ఆయన పేరు పాపులారిటీ సంపాదించుకుంటారు అనేది చూడాలి. టాలీవుడ్ లో మాత్రం హీరోలకు తమన్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారట. తమన్ ఉంటే అద్భుతమైన సంగీతం అందించడం తో పాటు సినిమా కూడా గ్యారెంటీగా హిట్ అవుతుందనే వారు భావిస్తున్నారు. అందుకే తము ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన కోసం వెయిట్ చేసి సినిమా చేయాలి అనేది హీరోల మాట.

ఏదేమైనా తమన్ రేంజ్ ఈ రేంజ్ లో పెరిగిపోవడం ఆయన అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తోంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ సినిమాలను సగానికిపైగా తమన్ సంగీతం సమకూరుస్తున్న సినిమాలే ఉండడం విశేషం. అలాగే చిన్న సినిమాలకు సైతం ఆయన సంగీతం అందిస్తున్నారు. వాటికి సైతం మంచి సంగీతాన్ని సమకూరుస్తు ప్రేక్షకులను బాగా దగ్గర అవుతున్నాడు. అలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాను కూడా చేస్తూ మంచి పాటలను నేపథ్య సంగీతాన్ని అందిస్తు ముందుకు దూసుకు పోతున్నాడు. మరి భవిష్యత్తులో ఈ సంగీత దర్శకుడు ఇంకెన్ని శిఖరాలను అధిరోహిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: