టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వారసులకు ఏమాత్రం కొదవలేదు. ఒకరు సినిమా పరిశ్రమలోకి వచ్చారు అంటే వారి తర్వాత వారి కుటుంబ సభ్యులు వరుసగా సినిమా పరిశ్రమలోకి వచ్చి సెటిల్ అయిపోతున్నారు. అలా ఇప్పుడు ఇండస్ట్రీలో డజను కు పైగా నే వారసులు ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక కుటుంబంలోనీ పెద్ద సినిమా పరిశ్రమలో ఉంటే ఆ తర్వాత ఆయనను నమ్ముకొని చిన్న వాళ్ళు అందరూ కూడా సినిమా పరిశ్రమలోకి వస్తున్నారు.  అలా అన్నయ్యలు సినిమా పరిశ్రమలో హీరోగా ఎదిగి రాణిస్తుండగా తన తమ్ములను కూడా హీరోలుగా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు కొంతమంది. 

మెగాస్టార్ చిరంజీవి తాను హీరోగా ఎదిగిన తరువాత తన తమ్ములను సినిమా పరిశ్రమ లోకి తీసుకువచ్చి వారు ఇప్పుడు ఇంతటి స్థాయి అనుభవించేలా చేశారు. ఆ తరువాత కూడా ఎంతో మంది హీరోలు తమ వారిని ఇక్కడికి తీసుకు వచ్చారు. ఇటీవల కాలంలో ఎంతోమంది యంగ్ హీరోలు సైతం తమ తమ్ముళ్లను సినిమాలలో కి తీసుకు వచ్చి వారిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తర్వాత తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను కూడా సినిమా పరిశ్రమకు తీసుకువచ్చి ఆయన కెరీర్ తొలి సినిమాతోనే సెట్ చేశారు. 

ఇక విజయ్ దేవరకొండ కూడా సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా నిలదొక్కుకోగా ఇప్పుడు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. మంచి కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ హీరోకి ఇప్పుడు భారీ కమర్షియల్ హిట్ ఎంతైనా అవసరం ఉంది. ఇంకా అల్లు అర్జున్ కూడా తన తమ్ముడు అల్లు శిరీష్ ను హీరోగా నిలబెట్ట లేకపోతున్నాడు. ఇంత బ్యాక్ గ్రౌండ్ లో ఉండి కూడా తన తమ్ముడిని కనీస స్థాయి ఉన్న హీరోగా కూడా నిలబడలేక పోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి. ఇటు నాగచైతన్య కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కానీ తన తమ్ముడిని మంచి మార్గంలో హిట్లు సాధించే మార్గంలో నడిపించలేక పోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: