అందాల ముద్దుగుమ్మ అయిన సమంత విడాకుల తర్వాత చాలా స్పీడ్ అయిందని తెలుస్తుంది.. ఒక వైపు సినిమాలు మరో వైపు సోషల్ మీడియా, ఇంకోవైపు బిజినెస్‌ల ద్వారా రెండు చేతులా ఆమె బాగా సంపాదిస్తుంది.

ఇప్పుడు క్రిప్టో యాప్‌కి ప్రచారకర్తగా మారిందని తెలుస్తుంది.. ఇందులో చిన్నచిన్నగా పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు సంపాదించొచ్చని ఆమె చెబుతుంది. గతేడాది 2021లో క్రిప్టోకరెన్సీలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారట.. 2022లో కూడా క్రిప్టోకరెన్సీలో గట్టిగా పెట్టుబడులు ఉండొచ్చని ఆమె ఊహించారు. అయితే, గత వారం రోజులుగా క్రిప్టోకరెన్సీల ధరలు భారీగా క్షీణిస్తున్నాయని దీని కారణంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ రూ.75లక్షల కోట్లు తగ్గిందని తెలుస్తుంది.

సమంత మాత్రం క్రిప్టో యాప్ ద్వారా బిట్ కాయిన్ కొని అమ్ముకొని మంచి లాభాలు పొందొచ్చని చెబుతుందట.జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సమంత చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుందట.ఈ ముద్దుగుమ్మ తన అందాలు ఆరబోస్తూ ఇంతలా ప్రచారం చేయడం చూసి అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ని మించి గ్లోబల్‌ ఇమేజ్‌ దిశగా అడుగులు వేస్తున్న సమంత తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుందట.. వ్యాపార పరంగానూ దూసుకుపోతుందట సమంత.రెండేళ్ల క్రితం సమంత.. తన ఫ్రెండ్‌ సుశృతి క్రిష్ణతో కలిసి `సాకీ` పేరుతో ఉమెన్స్ వేర్‌ని ప్రారంభించిందని ఫ్యాషన్‌ రంగంలో తనదైన స్పెషాలిటీతో ఈ సాకీని క్లాత్స్ వేర్‌ని ప్రారంభించిందట.



తన ప్రొడక్ట్ లకు తనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి ప్రమోట్‌ చేసిందట సమంత. కరోనా మొదటి లాక్‌డౌన్‌ సమయంలో ఆమె పూర్తిగా ఈ బిజినెస్‌ పైనే దృష్టిపెట్టింది. అయితే రెండేళ్ల తర్వాత దీన్ని విస్తరించబోతుంది. అప్పుడు టీనేజ్‌ మరియు అడల్ట్స్, ఉమెన్స్ కి ఉండగా, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా విస్తరిస్తుంది. `సాకీ` బ్రాండ్‌లో భాగంగా `సాకీ గర్ల్స్` పేరుతో కిడ్స్ వేర్‌ని కూడా లాంచ్‌ చేయబోతుంది. రెండేళ్ల నుంచి 8ఏళ్ల వరకు గర్ల్స్ కి ఈ కిడ్స్ వేర్‌ని ప్రారంభించబోతున్నారని ఇందులో అన్ని రకాల మోడల్స్ ని అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ విషయాన్ని సమంతతోపాటు సాకీ ఫౌండర్‌ సీఈవో సుశృతి క్రిష్ణ రీసెంట్‌గా ప్రకటించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: