దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఎంతో గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, రాఘవేంద్ర రావు అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలతో మాత్రమే కాకుండా నేటితరం హీరోలతో కూడా సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి, అయితే ఎన్టీఆర్ నట వారసుడు అయిన బాలకృష్ణ కు మాత్రం రాఘవేంద్రరావు ఇప్పటివరకు ఒక్క విషయాన్ని కూడా అందించలేకపోయాడు.  రాఘవేంద్ర రావు దర్శకత్వంలో బాలకృష్ణ ఇప్పటి ఇప్పటి వరకు ఏడు సినిమాలలో నటించాడు, అందులో ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించాడు,  ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ సినిమా పట్టాభిషేకం, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా అపూర్వ సహోదరులు,  ఈ సినిమాలో మొదటిసారి బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగవ సినిమా సహస సామ్రాట్,  ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఐదవ సినిమా దొంగ రాముడు, ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆరవ సినిమా అశ్వమేధం, ఈ సినిమాలో శోభన్ బాబు కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించాడు, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఏడవ సినిమా పాండురంగడు, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: