ఎఫ్ 3 డైరక్టర్ అనీల్ రావిపుడికి ఓ విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. తన ముందు సినిమా హీరోయిన్ ని తన తర్వాత సినిమాలో ఏదో ఒక సీన్ లోనో.. సాంగ్ లోనో చూపిస్తాడు. తన మొదటి సినిమా పటాస్ నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన సరిలేరు నీకెవ్వరు వరకు అలాంటి సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడు అనీల్. పటాస్ హీరోయిన్ శృతి సోదిని సుప్రీం లో.. సుప్రీం హీరోయిన్ రాశి ఖన్నాని రాజా ది గ్రేట్ లో.. రాజా ది గ్రేట్ హీరోయిన్ ని ఎఫ్ 2లో.. ఎఫ్ 2 తమన్నాని సరిలేరు నీకెవ్వరు లో అలా హీరోయిన్స్ విషయంలో ఒక సెంటిమెంట్ ఫిక్స్ చేసుకుని ఫాలో అవుతున్నాడు. ఇక ఇప్పుడు సరిలేరు హీరోయిన్ రష్మికని కూడా ఎఫ్ 3లో భాగం చేస్తున్నాడని టాక్.
సెంటిమెంట్ ప్రకారంగానే కాదు రష్మిక ఉంటే ఎఫ్3 ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వస్తుందని అనుకుంటున్నారు. అందుకే రష్మికని ఎఫ్ 2లో తీసుకుంటున్నారని టాక్. ఎఫ్3 సినిమాలో రష్మిక కన్ ఫర్మ్ అయితే మాత్రం అమ్మడి ఖాతాలో మరో హిట్ పడినట్టే అని చెప్పొచు. ఎఫ్ 2 సినిమా కి కొనసాగింపు కథతో వస్తున్న ఈ ఎఫ్ 3 ముందు సినిమాకు మించి ఫన్ ఇస్తుందని అంటున్నారు.