సామాన్యుడు.. నాట్ ఎ కామన్ మ్యాన్ అనే క్యాప్షన్ తో కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు..ఇకపోతే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలతో సమానంగా విడుదల చేయాలని ఆలోచించాడు విశాల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా టికెట్ల గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన సినిమాను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. ఈ సినిమాకు హీరోగా వ్యవహరించిన విశాల్ నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు విశాల్.. తుపా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా యోగి బాబు, బాబు రాజు జాకబ్ కీలక పాత్ర పోషించారు.


ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి  2021 ఆగస్టు 29వ తేదీన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టీజర్ నీ విడుదల చేశారు. మొదట రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని నిశ్చయించుకున్నాడు విశాల్ కానీ కరోనా కారణంగా థియేటర్లు కూడా మూత పడుతున్న తరుణంలో ప్రజలు ఇబ్బంది పడుతూ.. సినిమాలు చూడలేరు అన్న కారణంతోనే తన సినిమాను మళ్ళీ వాయిదా వేసుకున్నాడు. ఎట్టకేలకు ఫిబ్రవరి 4వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము అని అధికారిక ప్రకటన కూడా చేశారు విశాల్..


ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన అయినా సరే విడుదల అవుతుందో లేదో తెలియదు కానీ ఈ డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. విశాల్ తెలుగు, తమిళ సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎక్కువ పారితోషికం అందుకుంటూ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన  విషయం ఏమిటంటే ఈయన సినిమాలలో ఆయన కాస్ట్యూమ్స్ కి పెద్దగా ఖర్చు ఉండదు అని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.. అందుకే ఆయన సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతూ మంచి విజయాలను అందుకుంటూ వుంటాయి. ఇక సామాన్యుడి సినిమా ఫలితం గురించి తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 4 వరకూ ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: