సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటే తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేయడం లేదా ఇతర భాషలలో రీమేక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు హీరోలు అలాగే దర్శకనిర్మాతలు.. ఎన్నో సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అటు బాలీవుడ్ తో పాటు ఇతర భాషా చిత్రాలలో కూడా రీమేక్ అయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా బాలయ్య బాబు.. బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి భారీ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే..


అంతేకాదు కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకొని అఖండ సినిమా అఖండమైన విజయాన్ని పొందింది.. ఇందులో భాగంగానే ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ హిందీలో మాత్రం తప్పకుండా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. అంతేకాదు ఈ సినిమాకు ఇద్దరు బీ టౌన్ బడా హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.. ఇక బాలయ్య అఖండ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించినట్లు గానే బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ లో బాలయ్య పాత్రలో నటించడానికి అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్ కూడా పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అక్షయ్ కుమార్ ఇప్పటికే రోబో టు సినిమా లో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు గా మారారు.. ఇకపోతే బీటౌన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా  గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ అలాగే అజయ్ దేవగన్ ఇద్దరు ఈ సినిమా కి పోటీ పడుతున్నట్లుగా.. మరి ఫైనల్ గా ఎవరు నటిస్తారు అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.. వీరిద్దరిలో ఎవరు నటించినా సరే తెలుగులో అఖండ లో బాలయ్య స్థానాన్ని ఈ స్టార్ హీరోలు భర్తీ చేయగలుగుతారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇకపోతే బాలీవుడ్ లో హీరోలు అఖండ సినిమాతో తమ సత్తా చాటుతారో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: