సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది మొదటి సినిమాతోనే మంచి విజయాలను అందుకని ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు, కానీ మరికొంతమంది మాత్రం నటిస్తున్న సినిమా కూడా విడుదల కాకముందే  మరికొన్ని సినిమా ఆఫర్ లను కూడా దక్కించుకుంటారు, అలా టాలీవుడ్ లో నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే వరుస సినిమా ఆఫర్ లను దక్కించుకుంటుంది సంయుక్త మీనన్.  

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో దగ్గుబాటి రానా సరసన హీరోయిన్ గా నటిస్తోంది, ఈ  సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాలు నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా ఈ సినిమా విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సార్ సినిమాలో కూడా అవకాశం దక్కింది, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించిన  ఒక్క సినిమా కూడా విడుదల కాకముందు ధనుష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది, ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే సంయుక్త మీనన్ కు అదిరిపోయే ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు,   ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: