స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ‘గంగోత్రి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఫస్ట్ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ తర్వాత మూవీ ఆర్యతో బన్నీ కెరీర్ మొత్తం మారిపోయింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. ఫ్యామిలీ, లవ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బన్నీ.. మాస్ ఆడియన్స్‌ ను కూడా అలరించేందుకు ఎన్నో సినిమాలు చేశారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సెట్ చేసుకున్నారు. అయితే సినీ కెరీర్ ప్రారంభంలో అందరూ హీరో, హీరోయిన్లకు ఒడిదొడుకులు వస్తుంటాయి. ఆ టైంలో ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొంటారు.

 

సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఒక సినిమా హిట్ అయిన తర్వాత.. మరొక సినిమా ఫ్లాప్ అవ్వడం సహజం. అది వారి సినీ కెరీర్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి, స్టోరీ సెలక్షన్‌లో హీరోలు ఎంతో ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఆ సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యేంతవరకు వాళ్లకు టెన్షన్‌గానే ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితేనే వారికి అవకాశాలు వస్తుంటాయి. లేకపోతే ఫ్లాప్ హీరో అని ముద్ర పడి.. ఆఫర్లు తగ్గుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆయన హీరోగా నటించిన ‘గంగోత్రి’ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో మంది తనని చూసి హేళన చేశారంట.


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో ఇలా ఉన్నాడేంటి..? ఇతడి మొహం ఇలా ఉందేంటి..? అసలు హీరోగా రాణిస్తారా..? అంటూ చాలా మంది కామెంట్లు చేసేవారట. దీంతో అల్లుఅర్జున్ లోపల ఎంత బాధ పడేవారంట. కానీ ఎప్పుడూ బయట కనిపించేటప్పుడు చిరునవ్వుతో పలకరించేవారట. అప్పట్లో అలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొని.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. యూత్‌కి ఐకాన్ స్టార్‌గా నిలిచారు. బన్నీ కెరీర్‌లో దేశముదురు, ఆర్య సినిమాలు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: