సినిమా ఇండస్ట్రీలో జ్యోతిష్యం, న్యూమరాలజీ, జాతకాలు, సెంటిమెంట్ లకి ప్రాధాన్యత ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఒక సినిమా ప్రారంభం దగ్గర్నుంచి సినిమా టైటిల్స్ వరకు మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక నటీనటుల విషయానికొస్తే ఇప్పటికే గతంలో చాలా మంది హీరోలు,హీరోయిన్లు న్యూమరాలజీ ప్రకారం తమ పేర్లు మార్చుకున్నారు. అయితే వారిలో కొంతమందికి యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ పేరు మార్చుకున్న తర్వాత నుంచి సినిమాల విషయంలో మంచి విజయాలను అందుకున్నారు. అందుకే వాళ్ళని చూస్తూ మరి కొంతమంది నటీనటులు కూడా న్యూమరాలజి ఫాలో అవుతుంటారు. 

ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో టాలీవుడ్ యంగ్ హీరో అరుణ్ అదిత్ చేరాడు. తాజాగా తన పేరును మార్చుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే తెలుగులో తుంగభద్ర, వీకెండ్ లవ్, డియర్ మేఘ, గరుడవేగ వంటి సినిమాల్లో నటించాడు ఈ హీరో. ఇక ఇటీవలే ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని తో కలిసి 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' అనే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కొండా'అనే సినిమాలో నటిస్తున్నాడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. 

ఇక తెలుగులో డిఫరెంట్ మూవీస్ తో అలరిస్తున్న అదిత్ అరుణ్.. ఉన్నట్టుండి తన పేరును 'త్రిగున్' గా మార్చుకున్నాడు.ఈ మేరకు తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ..' ఇట్స్ ద న్యూ మీ 'త్రిగున్' అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు తనను త్రిగున్ గా పిలవాలని కోరాడు. ఇక ఇప్పటికే హీరోగా పలు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఇతను.. కమర్షియల్గా మాత్రం భారీ విషయాలను అందుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలోనే తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం పేరు మార్చుకున్న ఈ హీరో ఇకపైన కమర్షియల్గా విజయాలు అందుకుంటాడు ఏమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: