సుడిగాలి సుధీర్ కి ప్రస్తుతం బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కమెడియన్ గా మాత్రమే కాదు  సుధీర్ ఏకంగా బుల్లితెరపై హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఎంతో మంది యువత సుధీర్ పేరెత్తితే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు కేవలం జబర్దస్త్ ద్వారా బుల్లితెర కే పరిమితమైన సుడిగాలి సుధీర్ ఇక ఇప్పుడు వెండితెరపై హీరోగా నిలదొక్కుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన త్రీ మంకీస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.


 ఇక మరోవైపు సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం గాలోడు అనే సినిమాలో నటిస్తున్నాడు సుడిగాలి సుదీర్. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ మాస్ లుక్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఇక పోతే ఇప్పుడు సుడిగాలి సుదీర్ మాస్కోలో దర్శనమిచ్చాడు. ఇటీవలే ఇంస్టాగ్రామ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే సుధీర్ పక్కన సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం.



 ఇలా సుధీర్ ప్రకాష్ రాజ్ మాస్కో లో  ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే మా ఎలక్షన్ సమయం లో ప్రకాశ్ రాజ్ కి మద్దతు పలికాడు సుడిగాలి సుధీర్. అప్పటి నుంచి ఆ టీమ్ వెంటే నడుస్తున్నాడు. ఇక ఇప్పుడు వీరిద్దరూ మాస్కోలో ఎందుకు ఉన్నారు అన్నది ఆసక్తికర చర్చ జరుగుతోంది.  గాలోడు సినిమా సాంగ్స్ షూటింగ్ ఉండడం వల్లే సుదీర్ మాస్కో కి వెళ్ళాడు అంటూ కొంతమంది అభిమానులు అనుకుంటున్నారు. లేదు ఏదైనా కొత్త సినిమా షూటింగ్ కోసం ప్రకాష్ రాజు సుడిగాలి సుదీర్ మాస్కో వెళ్లారా అన్న చర్చ కూడా మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: