ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలను ఇంకా సృష్టిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల పరంగా బాలీవుడ్ లో రికార్డుల్ని తిరగరాస్తూ ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇక ఈ మూవీ విడుదలై నెల రోజులు కావస్తున్నా కూడా దీని హవా ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. `పుష్ప` సినిమా మేనియా ఇప్పుడు ఎల్లలు దాటి వరల్డ్ వైడ్ గా బాగా విస్తరిస్తోంది.క్రేజీ స్టార్ లతో పాటు క్రికెటర్లు కూడా పుష్ప సినిమా మేనియాకు ఫిదా అయిపోతున్నారు. ఇక ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా నుంచి డేవిడ్ వార్నర్ ఇంకా బ్రావో.. వరకు పుష్ప మేనియాకు ఫిదా అయిపోయి అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్పులని రీ క్రియేట్ చేస్తూ బాగా మురిసిపోయారు.ఇక ఆ వీడియోలని సోషల్ మీడియా వేదికగా వారు అభిమానులతో పంచుకోవడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యి తెగ చక్కర్లు కొడుతున్నాయి.


ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో డాషింగ్ క్రికెటర్ చేరాడు. అయితే అతను మాత్రం సోలోగా పెర్ఫార్మ్ చేయకుండా తన నానమ్మతో కలిసి శ్రీవల్లి పాటకు `పుష్ప` సిగ్నేచర్ స్టెప్ వేయడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఇక ఇండియన్ డాషింగ్ క్రేజీ క్రికెటర్ హార్థిక్ పాండ్యా తన నానమ్మతో కలిసి శ్రీవల్లి పాటకు `పుష్ప` సిగ్నేచర్ స్టెప్ వేశాడు. ఈ వీడియోని  తన ఇన్ స్టాలో షేర్ చేశాడు హార్దిక్ పాండ్య. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.పుష్ప సినిమా బన్నీని పెద్ద ఐకాన్ స్టార్ గా మార్చి వరల్డ్ వైడ్ గా బన్నీకి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది.ఇక ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా క్రేజ్ ని సొంతం చేసుకున్న బన్నీకి ఇప్పుడు `పుష్ప`సినిమాతో తాను కోరుకున్నట్లు పాన్ ఇండియా స్థాయిలో పేరొచ్చింది.ఇక ఈ సినిమాని సుకుమార్ ఏ ముహూర్తాన మొదలుపెట్టాడో కానీ బన్నీ అనుకున్నట్టుగానే తనని పెద్ద పాన్ ఇండియా స్టార్ గా మార్చి పలువురికి షాకిచ్చింది.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: