టాలీవుడ్ లో గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన అఖండ, పుష్ప; ది రైజ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అనే ప్రశ్నకు పుష్ప సినిమా సమాధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే అఖండ కలెక్షన్స్ తో పోలిస్తే పుష్ప రెట్టింపు కలెక్షన్లను అందుకుంది. కానీ డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించిన సినిమా ఏది అనే ప్రశ్నకు మాత్రం బాలయ్య 'అఖండ' పేరే సమాధానం గా వినిపిస్తోంది. అఖండ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే అప్పుడు పది కోట్లకు కొని దిల్ రాజు తప్పు చేశాడని కామెంట్లు వినిపించాయి.

ఎందుకంటే అఖండ కు ముందు బాలయ్య నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ కామెంట్లు వచ్చాయి. కానీ అఖండ మాత్రం నైజాంలో ఏకంగా 20 కోట్ల రూపాయల షేర్ మార్క్ ను అందుకని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తాజాగా ఓటీటీ వేదికైన హాట్ స్టార్  లో అఖండ మూవీ స్ట్రీమింగ్ అవడంతో ఇక అఖండ థియేట్రికల్ రన్ దాదాపుగా ఎండ్ అయిపోయినట్టే అని అనుకున్నారు. కానీ ఫుల్ రన్ లో అఖండ 74 కోట్ల మార్కును అందుకుంది. దాంతో దిల్ రాజు మాత్రం నైజామ్ ఏరియాలో అఖండ తో డబుల్ ప్రాఫిట్ ని అందుకున్నాడు. ఇక మరోవైపు పుష్ప సినిమా హిందీ హక్కులను కూడా దిల్ రాజు కొనుగోలు చేశాడు. ఈ సినిమా కోసం ఏకంగా 35 కోట్లు ఖర్చు పెట్టాడు.

అయితే నైజాంలో ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్లు కలెక్షన్ సాధించింది. అంటే నైజాంలో పుష్ప, అఖండ సినిమాలలో దిల్ రాజుకి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా అఖండ మాత్రమే. ఇక పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లో నష్టాలను మిగిల్చినా.. హిందీ లో మాత్రం భారీ వసూళ్లను అందుకొని నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది. బాలీవుడ్లో ఏకంగా ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తంమీద బాలయ్య సినిమాతో దిల్ రాజుకు పదికోట్ల రూపాయలు లాభం వస్తే.. అల్లు అర్జున్ సినిమాకి మాత్రం కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: