ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరు కూడా ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్స్ గా మారిపోతున్నారు  రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్, రాధాకృష్ణ, సుజిత్.. ఇలా చాలామంది మన తెలుగు దర్శకులు ఇప్పుడు ఫ్యాన్ ఇండియా దర్శకులుగా మారిపోయారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ కూడా చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ కూడా ఇటీవల తాను తెరకెక్కించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేసి పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నం చేశాడు.

అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని అందుకుంది. అయితే టాప్ డైరెక్టర్స్ తో పాటు ఇలా యువ దర్శకులు కూడ పాన్ ఇండియా డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతుంటే.. మన అగ్ర దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేకపోయాడు. కేవలం సౌత్ కి మాత్రమే పరిమితమయ్యే కథలను ఎంచుకుంటున్నాడు. ఆయన గత చిత్రం 'అల వైకుంఠపురం లో' ఇండస్ట్రీ హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో పాటలు మాత్రం నేషనల్ లెవెల్ లో ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాయి.

ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాత సినిమాలు కూడా ఇప్పుడు హిందీలో డబ్ అవుతున్నాయి. అల వైకుంఠ పురం లో సినిమా ను కూడా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తుండడంతో డబ్బింగ్ ప్లాన్స్ ని ఆపేసారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్. అయితే అది కూడా పాన్ ఇండియా సినిమా కాదట. దీంతో అసలు త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు తీస్తారా అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. కానీ త్రివిక్రమ్ తీరు చూస్తుంటే మాత్రం ఆయన కేవలం తెలుగు సినిమాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నారు. పైగా ఈ మధ్య నిర్మాతగా కూడా సినిమాలు చేయడం మొదలెట్టారాయన. కాబట్టి ఇప్పట్లో త్రివిక్రమ్ కి ఫ్యాన్ ఇండియా అనే ఆలోచనే లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: