టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా డిసెంబర్ 17న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా రికార్డుల పరంపర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు గత కొన్ని నెలలుగా రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అయితే 100 మిలియన్ వ్యూస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. యూట్యూబ్ లో తెలుగు సినిమాల పాటలు 100 మిలియన్ వ్యూస్ ని దక్కించుకోవడం చాలా చిన్న విషయంగా భావిస్తున్న ఈ సమయంలో పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట మాత్రం 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం అత్యంత అరుదైన రికార్డు గా నమోదైంది.

శ్రీవల్లి తెలుగు వెర్షన్ కి ఇప్పటికే 130 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అది పెద్ద రికార్డ్ ఏమీకాదు. కానీ ఇదే శ్రీవల్లి సాంగ్ హిందీ వర్షన్ లో తాజాగా 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం ఒక అరుదైన రికార్డు. ఎందుకంటే ఒక తెలుగు పాట లేదా ఒక సౌత్ ఇండియన్ సినిమా పాట హిందీలో డబ్ అవ్వడం.. దానికి 100 మిలియన్ల వ్యూస్ రావడం బహుశా ఇదే మొదటిసారి ఏమో. అందుకే ఇది అరుదైన ఘనత అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక అరుదైన ఘనతను పుష్ప సినిమా లోని శ్రీవల్లి పాట దక్కించుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు పుష్ప సినిమా స్థాయిని సోషల్ మీడియాలో ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎత్తేస్తున్నారు.

ఇక  పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావా'అనే మరో పాట కూడా హిందీలో కుమ్మేస్తోంది. ఇప్పటికే ఈ పాట పై చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక శ్రీవల్లి పాట ఒక్క హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా భారీ వ్యూస్ దక్కించుకుంది.మరోవైపు శ్రీవల్లి స్టెప్ కి కూడా అనూహ్య స్పందన రావడంతో చాలామంది సెలబ్రిటీలు ఈ స్టెప్ ని ఫాలో అవుతున్నారు. సినిమా సెలెబ్రెటీల నుండి  మొదలుపెడితే టీమిండియా క్రికెటర్లు సైతం శ్రీ వల్లి చస్టెప్ ను తెగ ఫాలో అవుతున్నారు. అందుకే శ్రీవల్లి హిందీ వర్షన్ సాంగ్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఏదేమైనా ఒక సౌత్ సినిమా అది కూడా తెలుగు సినిమా పాట హిందీలో తక్కువ సమయంలో 100 మిలియన్ల వ్యూస్ సాధించడం చాలా అరుదైన విషయం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: