టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుమారు 20 ఏళ్ల క్రితం హీరో తొట్టెంపూడి వేణు అగ్ర నటుడిగా ఓ వెలుగు వెలిగాడు. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వయంవరం' సినిమాతో హీరోగా పరిచయమై.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. వేణు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్ళాడు.స్వయం వరం తర్వాత చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి, కళ్యాణ రాముడు వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు. అయితే అతనికి వచ్చిన స్టార్ స్టేటస్ ను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక పోయాడు ఈ హీరో. ఎందుకంటే అతని తర్వాత వచ్చిన కుర్ర హీరోల తాకిడిని తట్టుకోలేక అవుట్ డేటెడ్ అయిపోయాడు.

అయితే వేణు కి సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా భారీగానే ఉంది. సీనియర్ బ్లాక్బస్టర్ డైరెక్టర్ బి.గోపాల్ ఇతనికి స్వయానా మేనమామ అవుతారు. అప్పట్లో బి.గోపాల్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు వేణు తో ఒక సినిమా చేసి ఉంటే వేణు రేంజే వేరు గా ఉండేది అయితే.అయితే అప్పట్లో వీరిద్దరికి కథ సెట్ అవలేదు. ఆ తర్వాత వేణు హీరోగా నిలదొక్కుకోలేక చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి జూనియర్ ఎన్టీఆర్ 'దమ్ము' సినిమాలో ఎన్టీఆర్ బావ క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఆ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. దాంతో మళ్లీ వేణు తిరిగి సినిమాల్లో కనిపించలేదు.

 అయితే మళ్లీ ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఫ్యూచర్లో  శ్రీకాంత్, జగపతి బాబు లాంటి సీనియర్ హీరోల మాదిరిగానే సపోర్టింగ్ రోల్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక వేణు బావ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. ఇంజనీర్ కావాలని అనుకున్న వేణు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయ్యాడు. అయితే ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సులు లేకపోవడంతో తన భార్యతో కలిసి వ్యాపారం చేస్తున్నాడట ఈ సీనియర్ హీరో. ఒకవేళ ప్రస్తుతం నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో వేణు పాత్ర కనుక క్లిక్ అయితే అతడికి టాప్ హీరోలు, దర్శకుల సినిమాల్లో మంచి రోల్స్ వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: