స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన సినిమా ''పుష్ప ది రైజ్''. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి భారీ విజయాన్ని నమోదు చేసింది.అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో అంచనాలకు మించి వసూళ్ళు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఈ సినిమా అవాక్కయ్యేలా చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా హిందీ భాషలో 100 కోట్ల దిశగా పరుగులు తీస్తూ ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి 'పుష్ప' పార్ట్-1 మూవీకి నార్త్ లో సరైన ప్రమోషన్లు చేయకపోవడం వల్ల ఇంకా అలాగే పేలవమైన డిస్ట్రిబ్యూషన్ కారణంగా హిందీ బెల్ట్ లో మొదటి రోజు దాదాపు రూ. 3 కోట్లు మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది. అయితే నార్త్ ఇండియా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి.'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ఇంకా అలాగే '83' వంటి రెండు క్రేజీ సినిమాలను కూడా ఎదుర్కొని 'పుష్ప: ది రైజ్' మూవీ ఈ రేంజ్ వసూళ్ళు అందుకోవడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు పుష్పరాజ్ సోషల్ మీడియాలో కూడా పెద్ద సంచలనంగా మారాడు. పుష్ప సిగ్నేచర్ స్టెప్ ఇంకా అలాగే పాటలు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక ఈ క్రమంలో ఇప్పుడు నార్త్ మార్కెట్ లో కూడా ఆరో వారంలోనూ 'పుష్ప-1' సినిమా బాగా అదరగొట్టింది.ఇక 'పుష్ప:ది రైజ్' సినిమా 6వ వారంలో 6 కోట్లు రాబట్టి 'యూరి: ది సర్జికల్ స్ట్రైక్' 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' తర్వాత ఆల్ టైమ్ మూడవ అత్యధిక ఆరవ వారం నెట్ గ్రాసర్ సినిమాగా చరిత్ర సృష్టించింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా ఆరవ వారం వసూళ్ళలో ప్రభాస్ నటించిన 'బాహుబలి: ది కన్క్లూజన్' (5.40 కోట్లు) సినిమాని సైతం క్రాస్ చేసి మూడవ స్థానాన్ని సంపాదించుకోని తెలుగు సినిమాల్లో సరికొత్త రికార్డుని సృష్టించింది.ఇక చూడాలి మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: