తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద చిత్రం తెలుగులో చేయాలని చాలామంది హీరోలు ప్రయత్నించినా కూడా అది పట్టాలెక్కలేకపోయింది. ఈ సినిమాలో ఓ పాత్రకు రవితేజ హీరో అనుకున్న కూడా మరొక హీరో సెట్ అవ్వకపోవడంతో ఈ చిత్రం అసలు మొదలవలేదు. బాలీవుడ్ లో కనుక ఈ సినిమా విడుదల అయితే తెలుగులో ఈ సినిమా వచ్చే సూచనలు తగ్గిపోతాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు దాదాపుగా బాలీవుడ్ సినిమాలను ఫాలో అవుతూ ఉంటారు 

అలాంటిది సౌత్ నుంచి వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో ఇప్పుడు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ చేస్తూ ఉండగా తెలుగు లో ఈ సినిమా మొదలు కాక పోవడం కొంత మంది అభిమానులను నిరాశ పరుస్తుంది. అయితే ఈ సినిమా తెలుగులో పట్టాలెక్కకపోవడానికి కారణం లేకపోలేదట. ఈ సినిమాలోని వేద పాత్ర గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని భావించడంతో అందరు హీరోలు కూడా ఆ పాత్ర నే చేయడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారట. దాంతో విక్రమ్ పాత్ర చేయడానికి హీరో దొరకని నేపథ్యంలో ఇది పట్టాలెక్కలేదు అని తెలుస్తుంది.

నిజానికి తమిళంలో వేద పాత్రను పోషించిన విజయ్ సేతుపతి కే అక్కడ భారీ స్థాయిలో పేరు వచ్చింది అదే సమయంలో ఎంతో వినూత్నమైన పాత్ర చేసిన మాధవన్ కు కూడా మంచి పేరు వచ్చింది. ఏదేమైనా ఈ సినిమాని తెరకెక్కించ లేక పోవడం నిజంగా నిర్మాతల వైఫల్యం అనే చెప్పాలి. రవితేజ వేద పాత్ర చేయాలని ముందు నుంచి ఉన్నా విక్రమ్ పాత్ర ను చాలా మంది హీరోలు దగ్గరికి తీసుకువెళ్లగా వారు నో చెప్పడంతో ఈ సినిమా అలానే నిలిచిపోయింది.ఇది స్టార్ హీరో చేయాల్సిన సినిమా కావడంతో కొత్తవారిని కూడా ట్రై చేయ లేక పోయారు మన నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: