టాలీవుడ్ లో వ్యాంప్ రోల్స్ చేసే నటీమణులు కొద్దిలో కొద్దీ మందే ఉన్నారు. వ్యాంప్ రోల్స్ అనగానే నటి జ్యోతి మరియు కరాటే కళ్యాణి అలాగే జయవాణి లాంటి నటీమణులు గుర్తుకు వస్తారు

 నటీమణులని తరచుగా వివాదాలు మాత్రం చుట్టుముడుతూ ఉంటాయి. నటి జయవాణి కూడా టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపిందట.

 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయవాణి మిగిలిన అన్ని రంగాలతో పోల్చితే చిత్ర పరిశ్రమలో ఇబ్బందులు అధికంగా ఉంటాయని పేర్కొందట.అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైంలో చాలా అవమానాలు కూడా ఎదురయ్యాయి. నలుపు వర్ణంలో ఉన్నావని నటిగా నువ్వు సెట్ కావు అని అవమానించిన వారు కూడా ఉన్నారని చెప్పిందట.

 
దీనితో నన్ను నేను నిరూపించుకునేందుకు అనేక విధాలుగా మేకప్ ట్రై చేసేదాన్ని అని పేర్కొందట.. ఇక అవకాశాలు రావడం మొదలయ్యాక.. ఎంత చిన్న పాత్ర అయినా కూడా అంగీకరించే దాన్ని. నా పాత్రకు 100 శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నించా అని పేర్కొందిట.

 
ఇక తన కెరీర్ లో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి జయవాణి సంచలన వ్యాఖ్యలు చేసిందట . ఓ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఇలా మీ కోసం ఓ క్యారెక్టర్ ఉందని వచ్చి కలవమని చెప్పాడట l. నేను నమ్మి వెళ్ళాను  ప్రేమ్ నగర్ చిత్రంలో రమాప్రభ లాంటి పాత్ర మరియు కాస్ట్యూమ్స్ లంబాడి తరహాలో ఉంటాయి. మీరు ఈ రోల్ కి సెట్ అవుతారో లేదు  ఫస్ట్ ఫోటో షూట్ చేయాలి అని చెప్పారట.
 
ఆ కాస్ట్యూమ్స్ లో నేను ఫోటోషూట్ కి రెడీ అయ్యాను డిఫెరెంట్ యాంగిల్స్ లో చాలా ఫోటోలు కూడా తీశారు. నాలుగైదు ఫోటోలు సరిపోతాయి కదా అండి అని అంటే మాత్రం ఇది ఫోటో షూట్ కదా అని చెప్పారు. సరే అని ఫోటో షూట్ చేసి వెళ్ళిపోయాను మళ్ళీ వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం కూడా లేదు.

 
కానీ నా అనుమతి లేకుండా ఇంటర్నెట్ లో ఫొటోస్ మొత్తం కూడా లీక్ చేసేశారు. అక్కడికి వెళితే దర్శకుడు, నిర్మాత మరియు కెమెరా మెన్ ఎవ్వరూ లేరు. వారంతా కొత్తవాళ్లు అని నేను వారి నంబర్స్ కూడా తీసుకోలేదు. దీనితో ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో అలాగే ఉండిపోయాయట.అవి నా కెరీర్ కే మచ్చగా మిగిలాయి అని వాపోయిందట జయవాణి. జయవాణి యమదొంగ, భరత్ అనే నేను, గుంటూరు టాకీస్ మరియు పటాస్, పంచాక్షరి లాంటి చిత్రాల్లో ఆమె నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: