పీవీ సింధు ఎన్నో రికార్డులు సాధించింది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు మెడల్స్‌ అందుకుని భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది. ఎంతోమంది అమ్మాయిలకి స్ఫూర్తిగా నిలిచింది. అయితే బాడ్మింటన్‌ కోర్టులో రారాణిగా వెలుగొందుతోన్న ఈ ఛాంపియన్‌ కూడా బాడీ షేమింగ్‌ని ఫేస్‌ చేసింది. నల్లగా ఉందని కామెంట్లు చేశారు. ఇది ఒక్క సింధు మాత్రమే కాదు, చాలామంది సెలబ్రిటీస్‌ ఈ బాడీ షేమింగ్‌ని ఫేస్ చేస్తున్నారు. మనిషికి కటౌట్‌ కంటే కంటెంట్‌ ముఖ్యమని బోల్డన్ని సినిమాల్లో చెప్పారు. హీరో ఇలాంటి డైలాగులు చెప్పగానే థియేటర్లు చప్పట్లు కొడతాయి. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ అని గుండెలు బాదుకుంటారు. కానీ ఆ డైలాగ్‌కి విజిలేసిన జనాల్లో చాలామంది సినిమా అయిపోయాక హీరోయిన్ లుక్స్‌ని విమర్శిస్తున్నారు. ఇదే హీరోయిన్స్‌కి పెద్ద సమస్యలా మారిపోయింది.

సాయి పల్లవి పెర్ఫామెన్స్‌కి, డాన్సులకి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. సౌత్‌ ఇండియా నుంచి మొదలుపెడితే నార్త్ ఇండియా వరకు జనాలంతా పల్లవి పెర్ఫామెన్స్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే 'శ్యామ్ సింగరాయ్' వచ్చాక కొంతమంది సాయి పల్లవి లుక్‌ని ట్రోల్ చేశారు. అందంగా కనిపించలేదని, పింపుల్స్‌తో సాదాసీదాగా ఉందని కామెంట్ చేశారు. దీనిపైన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కూడా స్పందించారు. బాడీ షేమింగ్‌ తగదని హితవుపలికారు.

అనుష్క 'సూపర్‌' సినిమాతో టాలీవుడ్‌లో భారీగా అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత 'బాహుబలి'తో నార్త్‌లోనూ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే స్వీటీ శెట్టి 'సైజ్‌జీరో' కోసం బరువు పెరిగాక అభిమానం స్థానంలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. స్లిమ్‌ నుంచి సుమోలాగా ఇలా మారిపోయిందేంటని విమర్శించారు. ఈ బాడీ షేమింగ్‌తో కొన్నాళ్ల పాటు సినిమాలకి కూడా దూరమైంది స్వీటీ. 'గద్దలకొండ గణేష్‌' సినిమాలో చేసిన 'జర్రా జర్రా' సాంగ్‌తో డింపుల్ హయాతికి క్రేజీ ఫాలోయింగ్‌ వచ్చింది.  ఈ స్పెషల్‌ సాంగ్‌ తర్వాత హయాతికి హీరోయిన్‌గా అవకాశాలు కూడా పెరిగాయి. రవితేజతో 'ఖిలాడి' సినిమా చేస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డింపుల్‌ కలర్‌ తక్కువ అని ఎవరూ అవకాశాలు ఇవ్వలేదట. అయితే గద్దలకొండ గణేష్‌ తర్వాత డింపుల్‌ స్టార్ మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: