అక్కినేని నాగార్జున త‌న‌యుడు యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు. ప్రేమ‌మ్ సినిమా త‌రువాత నుంచి క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ కుర్ర హోరో. వ‌రుస‌గా మ‌జిలీ, ల‌వ్‌స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకున్నాడు. ఇక ఇపప్పుడు విక్ర‌మ్ కుమార్ కె. ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు చైతు. గ‌త ఏడాది శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ల‌వ్ స్టోరీ సినిమాతో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకున్నాడు.


అదేవిధంగా సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా తండ్రి నాగార్జున‌తో క‌లిసి న‌టించిన సినిమా బంగార్రాజు సూప‌ర్ హిట్ సాధించిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. ప్ర‌స్తుతం అదే జోష్‌లో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా షూటింగ్‌ను కూడా శ‌ర‌వేగంగా కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా థాంక్యూ అనే ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌ను ఖ‌రారు చేసారు. ఈ సినిమాలో చైత‌న్య హాకీ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలోనే నాగ చైత‌న్య పుట్టిన రోజు సంద‌ర్భంగా థాంక్యూ చిత్రం నుంచి చిత్ర బృందం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు. ఆ పోస్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య ఎప్ప‌టి మాదిరిగానే చాలా హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారు.

ఇక ఈ  సినిమాలో  నాగ‌చైత‌న్య స‌ర‌స‌న నాయిక‌గా రాశిఖ‌న్నా న‌టిస్తున్నారు. అదేవిధంగా మాళ‌విక నాయ‌ర్‌, అవికాగోర్ కూడా న‌టిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన‌టువంటి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌-విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో గ‌తంలో మ‌నం తెర‌కెక్కిన విష‌యం విధిత‌మే. ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్యూటిపుల్ మెమొరిగా నిలిచింది. టాలీవుడ్‌లో వరుస‌గా సినిమాల‌ను విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా నాగ‌చైత‌న్య థాంక్యూ సినిమా విడుద‌ల ఏప్రిల్‌లో ఉంటుంద‌ని ట్వీట్ చేశారు. అయితే ఏప్రిల్ 14న విడుద‌ల‌వుతుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ మార్చి 25, భీమ్లానాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25 లేదా ఏప్రిల్ 01న‌, ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్ 29, ఎఫ్‌-3 ఏప్రిల్ 28, స‌ర్కారు వారి పాట మే-12, మార్చి11న రాధేశ్యామ్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అదే జోష్‌లో ఏప్రిల్‌లో థాంక్యూ సినిమా రాబోతుంది. ట్విట్ట‌ర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.  ఈ సినిమా ఏప్రిల్ 14 కు విడుద‌ల అవుతుందా లేక మ‌రీ ఇత‌ర తేదీలో విడుద‌ల‌వుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: