సినిమా పరిశ్రమలో దర్శకుడి భవిష్యత్ ఎప్పుడు ఏ విధంగా ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. సక్సెస్ ఉంటే వారి కెరీర్ ఒకలా ఉంటుంది. లేకపోతే వారి కెరీర్ మరోలా ఉంటుంది. ఆ విధంగా ప్రతి సినిమాకు వారి సక్సెస్ అనేది వారి భవిష్యత్తు సినిమాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో భారీ టాలెంట్ తో పాటు మంచి దర్శకత్వ ప్రతిభ కలిగి ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఒకే ఒక్క సినిమాతో తన సినిమా కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసుకున్నాడు.
 
కొత్త బంగారులోకం సినిమా తో మంచి ప్రతిభ గల దర్శకుడు అని పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ అడ్డాల  రెండో సినిమాను టాలీవుడ్ లో ఏ దర్శకుడుకి సాధ్యం కాని విధంగా సినిమా చేసి భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆ విధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి భారీ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడం ఆయన సినిమా కెరీర్ ను పూర్తిగా తలకిందులు చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమా యొక్క ప్రభావం ఆయనపై బాగా పడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ చిత్రం యొక్క ఫ్లాప్ ఆయనను బాగా కుంగదీసింది. దాంతో ఆయన సినిమా చేసేందుకు కొలుకోలేకపోయాడు.

చాలా సంవత్సరాలకు కానీ ఆయన తన తదుపరి సినిమా చేయలేకపోయాడు. అలా ఇటీవల ఆయన చేసిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించి శ్రీకాంత్ అడ్డాలను మరింత మంచి దర్శకుడిగా ప్రేక్షకులకు మరొకసారి చూపించింది. ఆ తర్వాత ఆయన సొంత కథతోనే తెలుగు సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆయన తన పట్ల ఎలాంటి సమాచారం లేకపోవడం ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తూ ఉంది. తాజాగా ఆయన బాలకృష్ణ తో ఓ సినిమా చేసే విధంగా ముందుకు వెలుతుండటం విశేషం. దీంతో కొంత మంది యంగ్ హీరోస్ ఈ దర్శకుడి నీ నమ్మకపోవడం తోనే ఇప్పుడు సీనియర్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు అని విమర్శలు చేస్తున్నారు. మరి వీరికి ఏ విధమైన సమాధానం ని ఆయన చెబుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: